Wednesday, May 15, 2024

అచ్చు పుష్ప‌లోని సీన్ – లారీ ట్రాలీ, యాక్సిల్ కి మధ్య‌లో గంజాయి బ‌స్తాలు

లారీ ట్రాలీ కింద బ‌స్తాల్లో నింపిన గంజాయిని త‌ర‌లిస్తున్న స్మ‌గ్ల‌ర్లు పోలీసుకు అడ్డంగా దొరికిపోయారు. ఇలా గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను పోలీసులు ప‌ట్టుకున్న వీడియోను టీడీపీ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఘ‌ట‌న‌లో గంజాయి స్మ‌గ్ల‌ర్లు లాంగ్ ట్రాలీ లారీని వినియోగించారు.లారీ ఓపెన్ టాప్ ట్రాలీలో ఓ ఇనుప వైర్ల లోడ్ పెట్టి స్మ‌గ్ల‌ర్లు బ‌య‌లుదేర‌గా..అనుమానం వచ్చిన పోలీసులు ఆ లారీని ఆపి త‌నిఖీ చేశారు. అనుమానం వ‌చ్చి ట్రాలీతో పాటు దాని కింది భాగాన్ని కూడా ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో ట్రాలీకి, యాక్సిల్‌కు మ‌ధ్య‌లో ఉన్న ఇనుక క‌మ్మీల మీద గంజాయి బ‌స్తాలను పోలీసులు గుర్తించారు. లారీ ట్రాలీని పైకి లేపి చూడ‌టంతో అక్క‌డ గంజాయి బ‌స్తాలు పెద్ద సంఖ్య‌లో క‌నిపించాయి. దీంతో గంజాయిని సీజ్ చేసిన పోలీసులు లారీని స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఉన్న వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన టీడీపీ… ఈ లారీతో పాటు అందులో ఉన్న వ్య‌క్తులు న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే, వైసీపీ నేత ఉమాశంక‌ర్ గ‌ణేశ్‌ అనుచ‌రులుగా ఆరోపించింది. పోలీసుల కంట‌బ‌డ‌కుండా కొత్త పుంత‌లు తొక్కుతూ గంజాయి ర‌వాణా చేస్తున్న వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు అంటూ ఆ వీడియోకు టీడీపీ ఓ కామెంట్‌ను జ‌త చేసింది. పుష్ప రాజ్ నే మించిపోయార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement