Thursday, May 16, 2024

Nobel worlds records: చిట్టి పాప ప్రతిభ… బంగారు పతకం ఇచ్చిన నోబెల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ

ఓ ఆరు నెలల చిన్నారి తన అద్భుత జ్ఞాపకశక్తితో అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వంద రకాల మొక్కలను గుర్తిస్తుంది ఆ చిన్నారి. మొక్క పేరు చెప్పగానే ఫ్లాష్‌కార్డు ఆల్బమ్‌లో మొక్కను గుర్తు ప‌ట్టేస్తోంది. ఇది తెలిసిన హైదరాబాదీ సంస్థ నోబెల్ వరల్డ్ రికార్డ్స్.. పాప ప్రతిభను పరీక్షించి ప్రశంసాపత్రంతో పాటూ బంగారు పతకాన్ని అందజేసింది.

దీంతో, చిన్నారిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఓ ఆరు నెలల చిన్నారికి నోబెల్ వరల్డ్ రికార్డ్స్’లో స్థానం ద‌క్కించుకుంది. కృష్ణ జిల్లా యనమలకుదురుకు చెందిన ఇడుపులపాటి నితిన్, తనూజ దంపతులూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి అయిదు నెలల కుమార్తె ఉంది. చిన్నారి పేరు జైత్రి. చిన్నారి పుట్టిన కొన్ని రోజులకే ఆమె అద్భుత జ్ఞాపక శక్తిని తల్లిదండ్రులు గుర్తించారు. దీంతో, పాపకు రకరకాల మొక్కలు చూపిస్తూ వాటి సాధారణ పేర్లతో పాటూ శాస్త్రీయ నామాలను చెప్పడం మొదలుపెట్టారు. కొన్ని రోజులకే పాప వంద రకాల మొక్కలను గుర్తు పట్టడం నేర్చుకుంది. మొక్క పేరు చెప్పగానే వెంటనే ఫ్లాష్‌కార్డ్ ఆల్బమ్‌లోని వాటి చిత్రాలను ఇట్టే గుర్తిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement