Tuesday, May 21, 2024

సామాన్య భక్తునిలా.. క్యూలైన్‌లో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్‌

తిరుమల, ప్రభన్యూస్‌ : శ్రీవారి సేవకులు భక్తులకు అందించే సేవ స్వామివారికి చేసినట్లుగానే భావించాలని టీటీడీ ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సామాన్య భక్తునివలె క్యూ లైన్‌లో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయం లోపల శ్రీవారి సేవలో ఉన్న నిజామాబాద్‌కు చెందిన లావ ణ్యతో పాటు వారి గ్రూపు సభ్యులు భక్తులకు చేస్తున్న సేవను ప్రత్యక్షంగా చూసి వారిని అభినందించారు. శ్రీవారి సేవ ఎన్ని రోజులుగా చేస్తున్నారు. ఆలయంలో ఎన్ని రోజులు చేస్తారు అని అడిగి తెలుసుకున్నారు. సామాన్య భక్తుల విషయంలో ఓర్పు సహనంతో వ్యవహరించి దర్శనం చేయించి పంపాలని వారికి సూచించారు. శ్రీవారి సేవ రూపంలో భగవంతుడు భాగ్యం కల్పించారని, ఏ ప్రాంతంలో సేవ చేసినా స్వామివారికి చేసినట్గుగానే భావించాలని చెప్పారు.

క్యూలో ఉన్న భక్తులతో ఛైర్మన్‌ మాట్లాడుతూ, సర్వదర్శనంలో వచ్చే భక్తులకు టోకెన్‌ తీసుకున్న రోజే ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం కల్పిస్తున్నామన్నారు. అన్నదానం, కళ్యాణకట్ట, దర్శనం వద్ద వసతులు బాగున్నాయని భక్తులు ఛైర్మన్‌కు సంతోషంగా చెప్పారు. రెండేళ్ళ తరువాత సర్వదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారని చైర్మెన్‌ను అభినందించారు. ఆన్‌లైన్‌లో దర్శనం టోకెన్లు బుక్‌ చేసుకున్నామని, తిరుమలలో ఏర్పాట్లు బాగున్నాయని, దర్శనం కుడా సంతృప్తిగా జరిగిందని మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దివాస్‌ పట్టణానికి చెందిన సురేంద్రరాథోడ్‌ చైర్మన్‌ను కలసి సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement