Monday, April 29, 2024

అహోబిలం ఆల‌యంలోకి చిరుత

కుక్క‌పిల్ల‌ల‌ను తీసుకెళ్లేందుకు ఓ చిరుత ఆలయంలోకి ప్ర‌వేశించింది. ఇది ఎక్క‌డంటే… క‌ర్నూలు జిల్లాలోని అళ్ల‌గ‌డ్డ ఎగువ అహోబిలం ఆల‌యంలో చోటుచేసుకుంది. చిరుత ఆల‌యంలోనే వెనుక‌వైపు ఉన్న ధ్వ‌జ‌స్థంబం నుంచి లోప‌లికి వ‌చ్చిన చిరుత రామానుజాచార్యుల మండ‌పం వ‌ద్ద ఉన్న కుక్క పిల్ల‌ల‌ను లాక్కెళ్లేందుకు ప్ర‌య‌త్నించింది. చిరుత‌ను గ‌మ‌నించిన కుక్క‌లు ఒక్క‌సారిగా దాడి చేశాయి. దీంతో ఆ చిరుత అక్క‌డి నుంచి తోక‌ముడుచుకుని పారిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ‌య్యాయి. ఎగువ అహోబిలం ఆల‌యంలోని రామానుజాచార్యుల మండ‌పం వ‌ద్ద కుక్క‌పిల్ల‌లు ఉన్నాయ‌ని ఎలా ప‌సిగ‌ట్టింద‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే, రెండు మూడు కుక్క‌లు అక్క‌డే ఉండ‌టంతో చిన్న కుక్క‌పిల్లలు బ‌తికి బ‌ట్ట‌గ‌ట్టాయి. లేదంటే దారుణం జ‌రిగిపోయేది. అహోబిలం ఆల‌యంలోకి చిరుత ప్ర‌వేశించిన‌ట్టు తెలుసుకున్న భక్తులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. అయితే గ‌తంలోనూ చిరుత‌లు ఆళ్ల‌గ‌డ్డ‌-అహోబిలం రోడ్డులో దుర్గ‌మ్మ ఆల‌యం వ‌ద్ద చిరుత క‌నిపించిన‌ట్టు అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement