Thursday, May 9, 2024

తిరుమలలో చిక్కిన చిరుత – వీడియోతో

తిరుమల – ఇటీవల తిరుమలలో బాలికపై దాడి చేసి చంపేసిన చిరుత చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటనాస్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలను అటవీశాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకుంది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గతంలోనూ ఓ చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించి కల్యాణ్‌ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

కాగా, చిరుతను తిరుపతి ఎస్వీ జూపార్క్‌కు (తరలిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. బోనులో చిక్కే క్రమంలో అది స్వల్పంగా గాయపడిందని, ఎస్వీ జూపార్కులో చికిత్స అందిస్తామన్నారు. అనంతరం అది మ్యాన్‌ ఈటర్‌ అవునా కాదా అనేదానిపై పరీక్షలు చేస్తామని తెలిపారు. కాగా, పట్టుబడిన చిరుతను ఎక్కడ వదలాలన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement