Monday, April 29, 2024

దేవాదాయశాఖలో పెద్ద ఎత్తున బదిలీలు.. జిల్లా అధికారులకు స్థానచలనం

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్ర దేవాదాయశాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సాధారణ బదిలీలకు అనుమతి ఇవ్వడంతో ఆలయ ఉద్యోగులు మొదలు అధికారుల వరకు బదిలీలు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఐదేళ్లు పైబడిన ఉద్యోగులు, ఒకే సంస్థలో దీర్ఘకాలంగా పని చేస్తున్న వారిని బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల్లోని ఆలయ ఉద్యోగులను డీసీ స్థాయిలో బదిలీలు చేయగా, పేరొందిన ఆలయాల ఉద్యోగులను కమిషనరేట్‌ అధికారులు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్లను కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరి జవహర్‌ లాల్‌ బదిలీ చేశారు. ఈమేరకు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఏసీ పీ.బాబూరావును కాకినాడ ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌కు, ఎన్‌టీఆర్‌ జిల్లా అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణను కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి, కాకినాడ ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ ఏసీ డీ.సాయిబాబును కృష్ణాజిల్లా ఏసీగాను, ఎన్‌టీఆర్‌ జిల్లా నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఏసీ ఎన్‌.సంధ్యను కృష్ణాజిల్లా సింగరాయపాలెం శ్రీవల్లి దేవసేనసమేత శ్రీ సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిగా, కాకినాడ జిల్లా లోవ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న గ్రేడ్‌-1 ఈవో పీ.విశ్వనాధ రాజును అదే ఆలయానికి అదనపు బాధ్యతలు ఇస్తూ కాకినాడ జిల్లాలోని కొన్ని 6(ఎ) ఆలయాల బాధ్యతలు అప్పగించారు. కోనసీమ జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఏసీ వై.భద్రాజీని పశ్చిమ గోదావరి జిల్లా మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం కార్యనిర్వహణాధికారిగా బదిలీ చేస్తూ భీమవరం జిల్లా దేవదాయశాఖ అధికారిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. భీమవరం మావుళ్లమ్మ ఆలయం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ డీ.శ్రీరామ వరప్రసాద రావును అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా బదిలీ చేశారు.

ఎన్‌టీఆర్‌ జిల్లా ముక్త్యాల శ్రీ హరిహర కోటిలింగాల మహాక్షేత్రంలో గ్రేడ్‌-1 కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎన్‌.ఎస్‌.చక్రధరరావును కృష్ణాజిల్లా మచిలీపట్నం బచ్చుపేట శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిగా బదిలీ చేయడంతో పాటు చల్లపల్లి ఎస్టేట్‌ ఆలయమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యశ్వరస్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. విశాఖపట్టణం ఏసీ కే.శాంతిని ఎన్‌టీఆర్‌ జిల్లా నెమలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిగా నియమిస్తూ ఎన్‌టీఆర్‌ జిల్లా దేవదాయశాఖ అధికారిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యశ్వరస్వామి ఆలయం కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఏసీ జీవీడీఎన్‌ లీలా కుమార్‌ను మచిలీపట్నంలోని శ్రీఏజీ విద్యా పరిషత్‌ కార్యనిర్వహణాధికారిగాను, శ్రీకాకుళం జిల్లా దేవదాయశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఏసీ కే.శిరీషను విశాఖపట్టణం ఏసీగా నియమిస్తూ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం కార్యనిర్వహణాధికారిగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. అనకాపల్లి శ్రీనూకాంబికా ఆలయం ఏసీ టీ.అన్నపూర్ణను శ్రీకాకుళం జిల్లా దేవదాయశాఖ అధికారిగాను, భీమవరం దేవదాయశాఖ అధికారి ఎస్‌.చంద్రశేఖర్‌ను శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లా దేవదాయశాఖ అధికారిగా, రాజమండ్రి శ్రీ హితకారిణి సమాజం ఏసీ సీహెచ్‌ రామ్మోహన రావును తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయానికి, అక్కడ విధులు నిర్వహిస్తున్న కే.విజయలక్ష్మిని రాజమండ్రి శ్రీ హితకారిణి సమాజానికి బదిలీ చేశారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఏసీ డీ.వెంకటేశ్వర రెడ్డిని కర్నూలు జ్యుయలరీ వెరిఫికేషన్‌ అధికారిగా నియమిస్తూ శ్రీ నెక్కంటి ఆంజనేయస్వామి ఆలయం ఈవోగా కొనసాగించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం డీఈవో పీ.గురుప్రసాద్‌ను శ్రీ కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఈవోగా, తిరుపతి బుగ్గమఠం ఏసీ హెచ్‌జీ వెంకటేశ్‌ను శ్రీశైలం ఎఈవోగా, శ్రీశైలం ఎఈవో జే.శ్రీనివాసరావును పెదకాకాని ఏపీఈటీ పరిపాలన అధికారిగా, కాణిపాకం ఎఈవో పీ.కస్తూరి బుగ్గమఠం ఏసీగా బదిలీ చేసత్‌ఊ కాణిపాకం ఎఈవోగా పూర్తిస్తాయి అదనపు బాధ్యతలు ఇచ్చారు. పోస్టింగ్‌ కోసం వేచివున్న గ్రేడ్‌-1 ఈవో ఎన్‌.శ్రీనివాసరెడ్డిని పెదకాకాని శివాలయం ఈవోగా పూర్తిస్తాయి అదనపు బాధ్యతలు ఇస్తూ గుంటూరు జిల్లా నందివెలుగు గ్రూపు ఆలయాలకు బదిలీ చేశారు. మంగళగిరి పానకాలస్వామి ఆలయం గ్రేడ్‌-1 ఈవో ఎం.పానకాలరావును బాపట్ల జిల్లా దేవాదాయశాఖ అధికారిగా, తిరుపతి ఆర్జేసీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ పీ.మల్లిఖార్జున రెడ్డిని శ్రీసత్యసాయి జిల్లా దేవదాయశాఖ అధికారిగా, శ్రీ సత్యసాయి జిల్లా దేవదాయశాఖ అధికారి పీ.ఇందిరా ప్రశాంతిని కర్నూలు డీసీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement