Monday, April 29, 2024

క‌లెక్ట‌ర్ బంగళా పైకి ఎక్కి యువ‌కుడి హ‌ల్ చ‌ల్….

క‌ర్నూలు – క‌ర్నూలు క‌లెక్ట‌రేట్ బంగళా ఎక్కి దూకుతానంటూ ఓ యువ‌కుడు పోలీసుల‌కు చెమ‌ట‌లు పట్టించాడు.. స్థానికంగా ఉండే ఈ యువ‌కుడు బంగళా ఎక్కి అక్క‌డ ఓ బ్యాన‌ర్ త‌గిలించాడు.. బ్యాన‌ర్ లో పేర్కొన్న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తే దిగేది లేద‌ని తేల్చి చెప్పాడు.. కాగా స్థానిక కోర్స్ కళాశాలలో నిర్మిస్తున్న కట్టడాలను వీడియో తీసేందుకు వెళ్లిన యువకులపై దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించిన ఇద్ద‌రు యువ‌కులు టి మ‌ద్దిలేటి, నిఖిల్ ల‌పై వెంట‌నే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసు న‌మోదు చేయాలంటూ పోలీసుల మందు డిమాండ్ ఉంచాడు.. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసే విష‌యంలో స్ప‌ష్ట‌మైన హామీ ఇవ్వ‌డంతో ఆ యువ‌కుడు బంగ‌ళా నుంచి కింద‌కు దిగాడు.. కింద‌కు దిగిన యువ‌కుడిని పోలీసులు సున్నితంగా మంద‌లించి ఇంటికి పంపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement