Sunday, April 28, 2024

Toll tax శివుని దర్శనానికి అటవీ శాఖ డబ్బులు డిమాండ్ – శివ స్వాముల ధర్నా

ఆత్మకూరు జనవరి 29 ప్రభ న్యూస్ : పరమ శివుని దర్శనం కావాలన్నా, శివ స్వాములు సైతం అటవీ అధికారులకు డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వలేదు అంటే దర్శనమే లేదంటూ ఆత్మకూరు అటవీ శాఖ అధికారులు శివ స్వాములను అడ్డగించిన ఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు మండల పరిధిలోని నల్లకాలువ గ్రామం నుండి రుద్ర కూడూరుకు శివున్ని దర్శించుకునేందుకు ఎన్నో ఏళ్లుగా శివ స్వాములు సామాన్య భక్తులు వెళుతూ ఉంటారు.

అయితే కొత్తగా శివ స్వాములు వెళ్లాలంటే మోటర్సైకిల్, ఆటోకు అయినా వెళ్తే ఒక్కొక్క దానికి 300 రూపాయలు ఇస్తే గాని రుద్రకోడూరుకు ఫారెస్ట్ అధికారులు వెళ్ళనివ్వడం లేదు. దేవున్ని దర్శించుకోవాలన్నా డబ్బులు ఇవ్వాలా మీకు అంటూ ఫారెస్ట్ అధికారుల తీరును నిరసిస్తూ కొందరు శివ స్వాములు నల్ల కాలువ గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు.

అసలు ఫారెస్ట్ అధికారులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలంటూ ఫారెస్ట్ అధికారులపై శివ స్వాములు మండిపడుతున్నారు. దేవుని దర్శనం కోసం వెళ్తూ ఉంటే డబ్బుల కోసం శివ స్వాములను ఆపడం ఏంటని శివ భక్తులు ప్రశ్నిస్తున్నారు. దీంతో శివ భక్తులంతా కలిసి నల్లకాలువ వద్ద నంద్యాల – ఆత్మకూరు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వెళ్లి రోడ్డుపై ధర్నా చేస్తున్న శివ భక్తులను శాంతింపజేసి ధర్నాను విరమింప చేశారు

. దీంతో ఫారెస్ట్ అధికారులు దిగొచ్చి మార్చి వరకు ఎలాంటి రుసుము లేకుండా భక్తులు వెలందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కొత్తగా అడవి జంతువులు ఎక్కువగా ఉండడం వల్ల శివ భక్తులకు ప్రమాదమని , అందుకే అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తే వెళ్లడం మానుకుంటారని కథ అల్లడం ఫారెస్ట్ అధికారులకే చెల్లింది.

ఏళ్ల నుండి వెళ్తున్న దాడి చేయని జంతువులు ఇప్పుడు ఎందుకు చేస్తాయని, కావాలనే ఫారెస్ట్ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా రుద్రకోడూరుకు ఎంతోమంది భక్తులు వెళ్లి వస్తున్న ఇంతవరకు ఒక్క జంతువు భక్తులపై దాడి చేయలేదని అలాంటిది ఇప్పుడే ఎందుకు చేస్తాయని భక్తులు ఆరోపిస్తున్నారు. కావాలనే ఫారెస్ట్ అధికారులు శివ స్వాములు భక్తుల నుండి కేవల దూరానికి ఆటో,లేదా బైకుకు 300 వసూలు చేస్తున్నారని శివ స్వాములు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement