Wednesday, May 22, 2024

23కిలోల వెండి ప‌ట్టివేత‌..

కర్నూలు: అనుమతి పత్రాలు సరిగా లేకుండా తరలిస్తున్న వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర పోలీసులు వాహనాల తనిఖీల సంద‌ర్భంగా ప్రైవేట్‌ బస్సులో తరలిస్తున్న 23 కిలోల వెండిని గుర్తించారు.. వెంట‌నే ఈ వెండిని స్వాధీనం చేసుకుని, ఎం. సిద్దేశ్ కుమార్, శరత్ కుమార్ లను అరెస్ట్ చేశారు.. పట్టుకున్న వెండి విలువ దాదాపు 11 లక్షల రూపాయల విలువ ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడులలో సెబీ సిఐ యెన్. లక్ష్మి దుర్గయ్య ఎస్ఐ.జీలానీబాషా.హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ అన్సార్బాషాఇమాంబాషా,విజయభాస్కర్. తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement