Thursday, April 25, 2024

కరోనా ఎఫెక్ట్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్..

కరోనా రెండో దశ ఉద్ధృతి దేశీయ స్టాక్ మార్కెట్లను ముంచేసింది. రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మదుపర్లు అమ్మకాలకు ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ ఏకంగా 1700 పాయింట్లకు పైగా నష్టపోయింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడికి సూచీలు గురి కావడంతో… మార్కెట్లు ఈరోజు ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. చివరి వరకు భారీ నష్టాల్లోనే పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,707 పాయింట్లు కోల్పోయి 47,883కి పడిపోయింది. నిఫ్టీ 524 పాయింట్లు నష్టపోయి 14,310కి దిగజారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement