Tuesday, May 21, 2024

జీతాలు ఆల‌స్యం.. బ్యాంకుల్లో పెనాలిటీలు.. గంద‌ర‌గోళంలో ఏపీ ఉద్యోగులు..

కర్నూలు : ఏపీ జేఏసీ అమరావతి మలిదశ ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కర్నూలు జిల్లా ఏపీ జెఎసి అమరావతి కమిటీ ఆధ్వర్యాన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ప్రతీ నెలా ఆలస్యంగా ఇస్తున్నందుకు నిరసనగా బ్యాంకర్లను కలిసి చెల్లింపులపై ఒత్తిడి చేయవద్దని, పెనాల్టిలను వేయవద్దని కోరుతూ ప్రధాన బ్యాంకుల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యాక్రంలో ఏపీ జెఎసి అమరావతి సంఘం చైర్మన్, ప్రధాన కార్యదర్శి గిరి కుమార్ రెడ్డి, కె.వై.కృష్ణ సభ్య సంఘాల నాయకులు, ఉద్యోగులు అందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకటో తేదీ జీతం రాకపోవడంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న ఉద్యోగులను డిఫాల్ట్ లిస్టులో పెట్టడంతో వారికి భవిష్యత్తులో తిరిగి రుణాలు తీసుకునే అవకాశం కోల్పోతున్నారని ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరి కుమార్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో జీతం ఏ రోజు వస్తుందో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామన్నారు. బ్యాంకు మేనేజర్లు ప్రభుత్వ ఉద్యోగులపై దయఉంచి వారు తీసుకున్న రుణాలకు ఈఎంఐలు కట్ చేయకూడదని బ్యాంకు మేనేజర్లకు వినతిపత్రం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement