Friday, May 3, 2024

మణులా.. మాణిక్యాలా..! ఆ ఇనప్పెట్టెలో ఏముంది?

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో పాత కాలం నాటి బీరువా తవ్వకాల్లో బయటపడింది. స్థానికంగా నివాసం ఉండే నర్సింహులు అనే వ్యక్తి ఇంటి నిర్మాణం కోసం పురాతన భవంతి గోడలను జేసీబీలతో పగుల గొడుతుండగా భారీ ఇనుప పెట్టె బయటపడింది. అచ్చం నేటి లాకర్‌లను పోలి ఉన్న ఈ పెట్టెపై ఇంగ్లీషులో మద్రాసు అని రాసివుంది. దానిపైన లక్ష్మీదేవి బొమ్మ ఉంది. ఈ ఇనుప పెట్టె ఇంచుకూడా కదపలేనంత బరువుంది. దీంతో ట్రాక్టర్‌లో తీసుకొచ్చి తెరిచేందుకు విఫలయత్నం చేశారు గ్రామస్తులు. భారీ బందోబస్త్‌తో బ్యాంకు లాకర్‌ల కన్నా బలంగా ఉన్న ఈ పెట్టెకు రెండు తాళాలున్నాయి. ఇది పురాతన కాలానిది కావడంతో ఇందులో భారీగా బంగారం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. చుట్టు పక్కల వాళ్లంతా కలిసినా దీన్ని మొయ్యలేకపోయారు. జేసీబీతో దీన్ని బయటకు తెచ్చారు. ఈ విషయం రెవెన్యూ అధికారులకు తెలిసింది. స్థానిక ఆర్డిఓ దీన్ని పరిశీలించి, ఓపెన్‌ చేసి అందులో ఏముందనేది తేల్చబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement