Thursday, May 2, 2024

ఫోన్ పోతే పోలీసు వెబ్ సైట్ లో అప్లై చేయండి.. 564 సెల్ ఫోన్లు రికవరీ : ఎస్పీ సిద్దార్థ్ కౌశల్

కర్నూలు : రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా మొదటి సారిగా కర్నూలు పోలీసులు అతి తక్కువ సమయంలోనే వివిధ రాష్ట్రాల నుండి రికవరీ చేసిన 564 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదివారం బాధితులకు అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో “మొబైల్ రికవరీ మేళా” కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారు. కర్నూలు పోలీసులు ముందు రోజే ఫోన్లను అందజేసేందుకు బాధితులకు సమాచారం అందించి కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంకు పిలిపించి బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. ఈ సంద‌ర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మొబైల్ మన జీవితంలో ఒక భాగమైందన్నారు. అటాచ్ మెంట్స్, సెంటిమెంట్స్, పర్సనల్ సమాచారం, ఎన్నో సేవలు మొబైల్ ద్వారా వినియోగిస్తామన్నారు. మొబైల్ ఫోన్ లతో పాటు ప్రజల ఆస్తిని కాపాడాల్సిన బాధ్య‌త పోలీసులపై ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు కారణాలతో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న భాదితులు ఇచ్చిన వివరాలను బట్టి 564 ఫోన్లు రికవరీ చేశామన్నారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న, చోరి అయిన వాటి పరిష్కారం పై కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా కూడా కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి పొగోట్టుకున్న సెల్ ఫోన్ వివరాలు అందజేస్తే సెల్ ఫోన్ రికవరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. డిజిపి, ప్రభుత్వం ఆదేశాల మేరకు మొబైల్ రికవరీ మేళా నిర్వహించామన్నారు.
kurnoolpolice.in/mobiletheft ఈ లింకు ను క్లిక్ చేసి ఆ వివరాలను సమర్పించండి. మీ మొబైలు ను తిరిగి పొందండి అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, డిఎస్పీలు వెంకటాద్రి , కెవి మహేష్, సిఐలు , ఎస్సైలు, సైబర్ ల్యాబ్ టెక్నికల్ టీం ఎస్సై వేణుగోపాల్, సైబర్ ల్యాబ్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement