Tuesday, April 30, 2024

తుంగభద్రకు భారీగా వరద.. నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కర్నూలు: తుంగభద్ర జలాశయానికి భారీ వరదనీరు వచ్చి చేరుకుంటుంది. వరద తీవ్రత దృష్ట్య ఏ క్షణమైన గేట్లు తెరిచేందుకు అవకాశం ఉందని తుంగభద్ర జలాశయ అధికారులు హెచ్చరించారు. ఈ క్రమంలో తుంగభద్ర తీర ప్రాంత ప్రజలకు, అధికారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా బళ్లారి, కర్నూలు జిల్లా కలెక్టర్లతో పాటు రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుంగభద్ర జలాశయంకు ప్రస్తుతం 98 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. ఇక జలాశయ నీటిమట్టం 1633 అడుగుల గాను 1624 అడుగులుగా నీటి నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం తుంగభద్ర ఎగువ భాగాన భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో జలాశయ నీటిమట్టం మరింత పెరగనున్న దృష్ట్య ఏ క్షణమైనా డ్యాం నుంచి నీళ్లు దిగువకు వదల వచ్చని ఇంజనీర్ల హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement