Thursday, May 2, 2024

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద‌..

నంద్యాల : శ్రీశైలం జ‌లాశ‌యానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు గేట్ ను పైకి ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌లాశ‌యం నుంచి ఇన్ ఫ్లో 3.20.000 క్యూ సెక్కులు, ఔట్ ఫ్లో 3.51.332 క్యూ సెక్కులు వ‌ర‌ద బ‌య‌ట‌కు వెళ్తున్న‌ది. పూర్తి స్థాయి నీటి నిల్వ 885 అడుగులు కాగా, ప్ర‌స్తుతం నీటి నిల్వ 884.60 అడుగులుగా ఉంది. జ‌లాశ‌యం పూర్తి స్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా, ప్రస్తుత సామర్థ్యం 214.80 టీఎంసీలు గా ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement