Wednesday, May 1, 2024

సుంకేసుల బ్యారేజ్ ను పరిశీలించిన కలెక్టర్

కర్నూలు నగరానికి నీటి సమస్య తీర్చడానికి సుంకేసుల బ్యారేజ్ ను జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. బ్యారేజ్ సామర్థ్యం ఎంత, ప్రస్తుతానికి ఎన్ని టీఎంసీలు నిల్వ ఉంది, ఎన్ని క్యూసెక్కుల నీటిని కెనాల్ కు విడుదల చేశారు, ఇంకా వేసవి తీవ్రత ఎక్కువ ఉంటే ఎన్ని నెలల వరకు నీటిని ఇవ్వవచ్చు వంటి వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్  అడిగి తెలుసుకున్నారు. సుంకేసుల బ్యారేజ్ మధ్యలో ఉన్న ఐలాండ్ ను డ్రోన్ తో వీడియో చిత్రీకరించాలని, ఐలాండ్ ఎలా ఉందో, ఎన్ని ఎకరాలు ఉందో జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు. ఐలాండ్ దగ్గరికి వెళ్లడానికి టూరిజం శాఖ బోటును తేప్పించాలని sసూచించారు. సుంకేసుల బ్యారేజ్ సమీపంలో ఉన్న ఐదెకరాల ఇరిగేషన్ స్థలంలో గార్డెన్ పెంచడంతోపాటు బృందావనం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement