Thursday, April 25, 2024

న‌టి సోనాక్షిసిన్హాకి ఊహించ‌ని సంఘ‌ట‌న – బాత్ రూంలో అభిమాని

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షిసిన్హాకి ఓ అరుదైన సంఘ‌ట‌న ఎదుర‌యింది. ది ఖత్రా ఖత్రా షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి.. తన వ్యానిటీ వ్యాన్‌ లో ఫోన్‌ చూసుకుంటూ ఉండగా.. ఇంతలో ఓ వ్యక్తి ఆమె అభిమాని అంటూ వాష్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చాడు. మేడమ్‌ నేను మీకు పెద్ద అభిమానిని. మీ కోసమే రాత్రి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నా…అంటూ సోనాక్షి అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన సోనాక్షి అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా… సదరు ఫ్యాన్‌ అక్కడ గందరగోళం సృష్టించాడు. అద్దంపై లిప్‌ స్టిక్‌ తో ఐ లవ్‌ యూ సోనా అని రాశాడు. ఇది నా రక్తంతో కూడా రాయగలను.. నన్ను పెళ్లి చేసుకో.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో షాక్‌ గురైన సోనాక్షి కేకలు వేయగా.. ఈ షో ప్రోమో వీడియో ముగిసింది. అయితే.. ఇదంతా ఫ్రాంక్‌ అని సోనాక్షికి తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement