Friday, May 17, 2024

పుర పోరు – కృష్ణా తీరంలో పాగా వేసేది ఎవ‌రు……

కీెలకమైన బెజవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లు నూజివీడు, పెడన మున్సిపాలిటీల్లో నువ్వా..నేనా
నందిగామ, తిరువూరు, ఉయ్యూరుల్లోనూ పోటాపోటీ
సంక్షేమమే అజెండాగా వైకాపా ప్రచారంలో దూకుడు
కొత్త మేనిఫెస్టో అమలు అంటూ తెదేపా ఆశలు
భాజపా, జనసేన కూటమి తొలి ప్రయత్నాలు
వేర్వేరుగా వామపక్షాలు రసకందాయంలో
కృష్ణా పురపోరు

అమరావతి, : రాజకీయ చైతన్యం కలిగిన కృష్ణా జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటు న్నాయి. మొత్తం 2 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 2 కార్పొరేషన్లు 2 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నింటా విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై రెండు ప్రధాన పార్టీలు కన్నేసి వారి వశం చేసుకునేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో అమరావతి నగరం అటు కృష్ణా, ఇటు గుంటూరు జిల్లాల్లోని కొంత ప్రాంతంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో విజయవాడ ప్రస్తుతం అమరావతి శాసన రాజధాని ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం 64 డివిజ్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. విజయవాడ నగరంలో 10 లక్షల జనాభా ఉండగా 7.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3.85 లక్షల మంది పరుషులు ఉండగా, 3.94 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ డా.పూనూరు గౌతమ్‌ రెడ్డి వంటి ప్రముఖలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే తెదేపా నుండి విజయ వాడ ఎంపీ కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్‌ మీ రా, మా జీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ వంటి నేతలు ఎన్నికలను పర్యవేక్షిసు ్తన్నారు. ఈనేపథ్యంలోనే జనసేన‌, భాజాపా కూటమి ఒక వై పు, వామపక్ష పార్టీలు మరోవైపు బరిలో దిగాయి. దీంతో ఇప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి.
నలుగురు.. మేయర్లుగా..
2000లో మేయర్‌కు నేరుగా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పంచుమర్తి అనురాధ గెలిచారు. ఆమె మేయర్‌గా ఐదేళ్లు కొనసాగారు. 2005 ఎన్నికల తర్వాత ఐదేళ్లలో ముగ్గురు మహిళలు మేయర్లుగా కొనసా గారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం కలసి పోటీ- చేసి గెలిచాయి. దీంతో మేయర్‌ పదవిని పంచుకున్నారు. మొదటి ఏడాది తాడి శంకుంతల, తర్వాత రెండేళ్లు మల్లికాబేగం, చివరి రెండేళ్లు రత్నబిందు మేయర్లుగా పదవి చేపట్టారు.
మచిలీపట్నం కార్పొరేషన్‌ హాట్‌
మచిలీపట్నం కార్పొరేషన్‌లోనూ మంచి రసకందా యంలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక్కడ సమాచార, పౌర సం బంధాలు, రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రా మయ్య (నాని) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక ప్రతిపక్ష తెలుగుదేశానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఇక్కడే ఉంటారు. మచిలీపట్నం కార్పొరేషన్‌ ఎన్నికలను ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటంతో జనసేన, భాజాపా కూటమి ఇక్కడ పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా గెలుపు మాదంటే .. మాదేనంటూ అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేయడం విశేషం. ము ఖ్యంగా బందరు పోర్టు నిర్మాణం ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేసే అంశంగా ఉంటుందనడంలోఎటువంటి సందేహం లేదు.
ఆ రెండు మున్సిపాలిటీల్లోనూ అదే తీరు
ఇక పెడన, గుడివాడ మున్సిపాలిటీల్లోనూ వైకాపా, తెదేపాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. గుడివాడ నుండి పౌర సర ఫరాల శాఖా మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం లో రాజకీయ ఉద్దండులనేక మంది ఉన్నారు. పెడన నియోజ కవర్గంలో ముస్లిం, దేవాంగుల ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఈనేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పక్షాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.
మూడు నగర పంచాయతీల్లోనూ గట్టిపోటీ
ఇక నందిగామ, తిరువూరు, ఉయ్యూరు నగర పంచాయతీల్లోనూ గట్టి పోటీ నెలకొంది. అయితే, ఈ మూడు కూడా గత ఎన్నికల సమయంలోనే నగర పంచాయతీలుగా పదోన్నతి పొందాయి. దాదాపు పల్లె వాతా వరణం ఉంటుంది. సంక్షేమ పథకాలే తమను గెలిపి స్తాయ ని వైసీపీ నేతలు గంపెడాశలు పెట్టుకున్నారు. పల్లె ప్రాం తాల్లో వైసీపీకి ఉన్న పట్టుతో ఇక్కడ గెలి చి తీరుతామని వారు చెబు తున్నారు. ఇక తెదేపా కూడా రెండేళ్ల వైకాపా పాలనలో ప్రజలు విసిగి వేశారరని, ఇప్పుడు ప్ర త్యామ్నా యంగా తిరిగి తమకే అవకాశం కల్పిస్తారని ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement