Sunday, April 28, 2024

Vijayawada: కాంథస్ సార్కోమాతో బాధపడుతోన్న 13 ఏళ్ల బాలుడికి ఏఓఐలో చికిత్స విజయవంతం

హైద‌రాబాద్ : విజయవాడలోని కానూరులో ఉన్న అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI), రాబ్డోమియోసార్కోమా (RMS) తో బాధ పడుతున్న 13 ఏళ్ల బాలునికి విజయవంతంగా చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ సంరక్షణలో ముఖ్యమైన మైలురాయిని సాధించింది. RMS అనేది క్యాన్సర్ యొక్క అరుదైన రూపం, ఇది మృదు కణజాలాలలో, ముఖ్యంగా అస్థిపంజర కండరాలలో లేదా కొన్నిసార్లు మూత్రాశయం లేదా గర్భాశయం వంటి బోలు అవయవాలలో ఉద్భవిస్తుంది. ఇది ఏ వయస్సులోని వ్యక్తులనైనా ప్రభావితం చేయవచ్చు.. కానీ అతి సాధారణంగా ఇది పిల్లలలో కనిపిస్తుంది. పేషంట్ మార్చి 2022 నుండి ఎడమ కంటి లోపలి భాగంలో కంటి కాంతస్‌( కనురెప్పల చివరి భాగం) వద్ద నొప్పిలేకుండా ఉన్న కణితిని కలిగి ఉన్నాడు. రోగ నిర్ధారణ, తదుపరి చికిత్స కోసం AOI కి వచ్చాడు. అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌లోని మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సాయి కృష్ణ కొల్లూరు, నిపుణుల సంరక్షణలో, రోగికి కీమోథెరపీ, రేడియోథెరపీతో కూడిన సమగ్ర చికిత్స అందించడం జరిగింది. డాక్టర్ సాయి కృష్ణ నైపుణ్యం, వ్యక్తిగతీకరించిన విధానం చిన్న పిల్లలకు సరైన సంరక్షణ, చికిత్స అందేలా చేయడంలో కీలక పాత్ర పోషించింది.

అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, కానూరు లో మెడికల్ & పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్, డాక్టర్ సాయి కృష్ణ కొల్లూరు మాట్లాడుతూ… ఈ కేసు విజయవంతమైన చికిత్స, ముఖ్యంగా రాబ్డోమియోసార్కోమా వంటి అరుదైన మృదు కణజాల సార్కోమాలను చికిత్స చేయటంలో ముందస్తు రోగనిర్ధారణ, వ్యక్తిగత చికిత్స ప్రణాళికల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుందన్నారు. త‌మ మల్టీడిసిప్లినరీ బృందం వ్యకిగతీకరించిన చికిత్సపై దృష్టి పెడుతుందన్నారు. ప్రతి పేషంట్ నిర్దిష్ట అవసరాలను తీర్చే వ్యూహాలు కీమోథెరపీ, రేడియోథెరపీ సమగ్రమైన, సమర్థవంతమైన కోర్సును నిర్ధారిస్తాయి, ఫలితంగా త‌మ చిన్న వయసులో వున్న రోగులకు సానుకూల ఫలితాలు లభించటంతో పాటుగా మెరుగైన జీవన నాణ్యత ఏర్పడుతుందన్నారు. విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్‌లోని రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… ఈ విజయవంతమైన కేసు అసాధారణమైన, వ్యక్తిగతీకరించిన క్యాన్సర్ సంరక్షణను అందించడంలో త‌మ నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందన్నారు. డాక్టర్ సాయికృష్ణ కొల్లూరు వంటి నిపుణుల నేతృత్వంలోని త‌మ అంకితభావంతో కూడిన బృందం అవిశ్రాంతంగా కృషి చేసి ప్రపంచ స్థాయి చికిత్సా ఎంపికలు, కారుణ్య సంరక్షణను అందించడానికి త‌మ రోగులందరికీ సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement