Sunday, April 28, 2024

AP : ముద్రగడతో కొత్తపల్లి భేటీ.. ఏపీలో హీటెక్కిస్తున్న పాలిట్రిక్స్​!

ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీనికితోడు కొన్ని సంఘాల నేతల తీరుతో రాజకీయ వేడి మెల్ల మెల్గా పెరుగుతోంది. దీనికి తోడు ఇవ్వాల (ఆదివారం) కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి
ముద్రగడ పద్మనాభం, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. కాగా, వైసీపీ నుంచి ఇటీవలనే కొత్తపల్లి సుబ్బారాయుడుపై వేటు పడింది. ఈ సస్పెన్షన్ పై సుబ్బారాయుడు కూడా వైసీపీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో వీరిద్దరు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పలు అంశాలపై సుమారు గంట పాటు ఇద్దరు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే.. తమ ఇద్దరి కలయిక వెనుక రాజకీయ ఉద్దేశం ఏమీ లేదని ముద్రగడ పద్మనాభం అంటున్నారు.

ఏపీలో కాపులు రాజకీయంగా ఎదగడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగడ పద్మనాభం. ఈ మేరకు రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనే పలు దఫాలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే కాపులు ఏర్పాటు చేసే రాజకీయ వేదికలో బీసీలు, దళితులను కూడా కలుపుకోని పోవాల్సిన అవసరం ఉందని గతంలో ముద్రగడ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి దిగుతానని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుండి పోటీ చేస్తాననే విషయమై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడంపై అంతా చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement