Monday, May 29, 2023

క‌శ్మీర్ అంశంలో రాజ‌కీయాలు వ‌ద్దు – బిజెపివి చెత్త రాజ‌కీయాలు – కేజ్రీవాల్

క‌శ్మీర్ స‌మ‌స్య‌ని ప‌రిష్క‌రించ‌డం బిజెపి పార్టీ వ‌ల్ల కాద‌ని విమ‌ర్శించారు సీఎం..ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు అర‌వింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆప్ కార్యకర్తలు నిర్వహిస్తున్న జన్ ఆక్రోశ్ నిరసన కార్యక్రమంలో కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమ్మూ కశ్మీర్ లో కశ్మీరీ పండిట్లను బలవంతగా తరలిస్తున్నారని ఆరోపించారు. 1990లో ఏంజరిగిందో మళ్లీ అదే జరుగుతోందని అన్నారు. బీజేపీకి తెలిసిందల్లా చెత్త రాజకీయాలు చేయడమేనని వ్యాఖ్యానించారు. దయచేసి కశ్మీర్ అంశంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. కశ్మీర్ లో సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము ఏంచేయబోతున్నది కేంద్రం ప్రజలకు వెల్లడించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. కశ్మీరీ పండిట్లు కశ్మీర్ వెలుపల ఉద్యోగాలు చేయరాదంటూ సంతకాలు చేయించుకున్న బాండ్ పత్రాలను రద్దు చేయాలని అన్నారు. కశ్మీరీ పండిట్ల అన్ని డిమాండ్లను పరిష్కరించాలని, వారికి భద్రత కల్పించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement