Thursday, May 2, 2024

ఉధృతంగా ప్రవహిస్తున్న పాపాగ్నినది

భారీ వర్షాల కారణంగా కడప జిల్లాలోని వెలిగల్లు ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరండంతో అధికారులు గేట్లు ఎత్తివేశారు. దీంతో పాపాగ్నినది ఉధృతంగా ప్రవహిస్తోంది. అటు విన్‌పల్లె మండలంలో ఓబులరెడ్డిపల్లె వాగు పొంగిపొర్లుతోంది. వాగు ఉధృతి అధికంగా ఉండటంతో మునీంద్ర, యర్రన్న అనే ఇద్దరు గొర్రెలకాపరులు వాగులో చిక్కుకుపోయారు. విషయం తెలిసిన వెంటనే స్ధానికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని గొర్రెలకాపరులను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement