Saturday, May 18, 2024

అటవీ అమరవీరులకు జోహార్లు: బాలినేని శ్రీనివాస్‌..

ఆరిలోవ, (ప్రభ న్యూస్‌): రాష్ట్ర వ్యాప్తంగా వున్న అటవీ సంపదను కాపాడేందుకు అటవీ శాఖాధికారులు, సిబ్బంది చేస్తున్న కృషి వర్ణనాతీతమైన‌ది అని అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కొనియాడారు. అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకుని బుధవారం కంబాలకొండ ఎకో పార్క్‌(eco park) లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగావున్న అటవీ సంపదను కాపాడే ప్రయత్నంలో తమ విధి నిర్వహణలో భాగంగా అశువులు బాసిన 22 మంది అమరులకు అటవీ శాఖ అమరవీరుల స్థూపం వద్ద మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, పీసీసీఎఫ్‌ ప్రతీఫ్‌కుమార్‌, మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల తదితరులు నివాళులర్పించారు. అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో అశువులు బాసిన 22 మంది అటవీ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తున్నామన్నారు.

అటవీ శాఖ పీసీసీఎఫ్‌ ప్రతీఫ్‌కుమార్‌ మాట్లాడుతూ అటవీ శాఖ అమరవీరుల త్యాగాలు మరువలేనివన్నారు. విధి నిర్వహణలో అశువులు బాసిన కుటుంబాలకు పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. అటవీ భూముల పరిరక్షణకు తమ సిబ్బంది కృతనిశ్చయంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. మేయర్‌ హరివెంకటకుమారి అటవీ అమరవీరులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే గిరిపుత్రులు, గిరిజనుల మనుగడకు, వారి అభివృద్ధికి ముఖ్యమంత్రి సమాలోచనలు చేస్తున్నారని, వారికి పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ అనిత, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ జి.సుభ్రద, సీసీఎఫ్‌, డీఎఫ్‌ఓలు, జూ క్యూరేటర్‌ డా. నందనీ సలారియా, అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement