Sunday, April 28, 2024

Video: హోలీ సంబరాల్లో జేసీ హల్ చల్.. అనుచరులతో స్టెప్పులేసిన ప్రభాకర్ రెడ్డి

తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హోలీ సంబరాల్లో మునిగితేలారు. పలు పాటలకు స్టెప్పులేస్తూ తమ అనుచరులు ఊపు తీసుకొచ్చారు. ప్రభాకర్ రెడ్డి ఏది చేసిన సంచలనం గానే ఉంటుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఒక తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అప్పటి నుంచి తాడిపత్రి లోనే ఉన్న రెడ్డి మున్సిపాలిటీ పై ప్రత్యేక దృష్టి సారించారు. పాలనాపరంగా ప్రజల వద్దకు మరింత దగ్గర అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తమ లోపాలను గుర్తించి వాటిని సర్దుకుంటూ ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా తాడిపత్రిలో తన ప్రభావాన్ని పెంచుకునేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. హోలీ సందర్భంగా హల్ చల్ చేశారు. అందరితో కలిసి స్టెప్పులు వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement