Thursday, May 2, 2024

Weather update: తెలుగు రాష్ట్రాలకు వాయు’గుండం’

అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం అండమాన్‌ సముద్రంలో సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అనంతరం ఇది ఈ నెల 17న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడి.. 18వ తేదీన దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి సమీపించి జవాద్‌ తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement