Friday, April 19, 2024

కేబీఆర్ పార్క్ లో నటిపై దాడి..ఫోన్ చోరీ..

పట్టపగలు, అందరూ తిరుగాడుతుండే ప్రదేశం, ఓ పక్క వాకర్స్, మరో పక్క బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి పేషెంట్ల బంధువుల తాకిడితో బిజీగా ఉండే ప్రదేశంలో దొంగతనం జరిగింది. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌కు వాకింగ్‌కు వెళ్లిన నటి చౌరాసియాపై ఈ ఉదయం దాడి జరిగింది. ఒంటరిగా ఉన్న ఆమెపై దాడిచేసిన దుండగుడు మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో నటిచౌరాసియానుకి స్వల్పంగా గాయాలయ్యాయి.చివరికి ఆమె చేతుల్లోంచి ఫోన్ గుంజుకున్న దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం చౌరాసియా 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. గాయపడిన నటి చౌరాసియాను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement