Friday, May 3, 2024

Jana Senani – వైసిపి నేత‌ల ఆరోప‌ణ‌ల‌తో నా భార్య రోధిస్తున్న‌ది – ప‌వ‌న్ క‌ల్యాణ్

ఏలూరు: రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని అందుకే నిలబడినట్లు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలాగే వాలంటీర్లపై తనకు కోపం లేదని జనసేన చీఫ్ తేల్చి చెప్పారు. ఏలూరు జిల్లాలో సాగుతున్న వారాహి యాత్రలో మహిళల అక్రమ రవాణలో వాలంటీర్లు కారణమౌతున్నారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఈ నేప‌థ్యంలో మంగళవారంనాడు దెందులూరులో జనసేన నేతలతో సమావేశమైన ప‌వ‌న్ మాట్లాడుతూ, వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోలేదన్నారు. వాలంటీర్ల పొట్టకొట్టాలని తనకు లేదన్నారు. జనవాణిలో వాలంటీర్లపై తనకు అనేక ఫిర్యాదులు అందాయన్నారు. ఆడపిల్లల్ని వాలంటీరు యువకులు ఇబ్బందులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయమై ఆడపిల్లల తల్లిదండ్రులు తమకు జనవాణిలో ఫిర్యాదు చేశారన్నారు.

ప్రతి 50 ఇళ్ల కంప్లీట్ డేటా వాలంటీర్ల చేతుల్లోకి వెళ్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఇంట్లో రహస్యాలు అనేవి ఉంటాయన్నారు.ప్రతి ఇంట్లో గుట్టు వాలంటీర్లు తెలుసుకుంటే ఎలా అని పవన్ కళ్యాణ్ అడిగారు. ”ఎవరో పెట్టిన పార్టీని వైకాపా వాళ్లు తీసుకున్నారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ.. వైకాపా. నన్ను బెదిరించారు. డబ్బుతో మభ్యపెట్టాలని చూశారు. జగన్‌ అంటే కోపం లేదు.. ప్రభుత్వ విధానాలపైనే నాకు ద్వేషం. నాయకులు చేసిన తప్పులు ప్రజలపై ప్రభావం చూపిస్తాయి.
ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వాలంటీర్ల వేతనాలు ఉన్నాయి. వాలంటీర్‌ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా?ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉంది. ఆ సమాచారాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారు. అమ్మాయిల అదృశ్యంపై వైకాపా నేతలు ఎందుకు స్పందించరు?విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే నాపై విమర్శలు చేస్తున్నారు. సేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్లు, ప్రజలపై దాడులు చేస్తారా? వైకాపా నాయకుల మాటలకు నా భార్య కూడా ఏడుస్తోంది” అని పవన్‌ పేర్కొన్నారు. రాజ‌కీయాల‌లోకి వ‌చ్చిన తర్వాత ఇటువంటి ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని నా భార్య‌కు చెప్పి ఓదార్చ‌న‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement