Thursday, September 21, 2023

అగ్నికి ఆహుతైన జామాయిల్ తోట.. నెల్లూరు జిల్లాలో ఘ‌ట‌న‌

వరికుంటపాడు (ప్రభ న్యూస్): నెల్లూరు జిల్లా వ‌రికుంటపాడు మండ‌లంలో జామాయిల్ తోట అగ్నికి ఆహుత‌య్యింది. త‌హ‌సీల్దార్ కార్యాలయం వెనుక వైపు ఉన్న బిరుదురాజు నాగరాజుకు చెందిన ఐదు ఎకరాల జామాయిల్ తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పింటించిన‌ట్టు స‌మాచారం. దీంతో జామాయిల్ తోట పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది.

- Advertisement -
   

రైతు నాగరాజు హుటాహుటిన‌ అక్కడికి చేరుకొని ఉదయగిరి ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది, ఎస్ఐ అశోక్ కుమార్ నేతృత్వంలో గంటసేపు శ్రమించి మంటలను అదుపు చేశారు. అప్పటికే దాదాపుగా 70 శాతం తోట దగ్ధం కావడంతో రైతు ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం త‌న‌ను ఆదుకోవాల‌ని, నష్టపరిహారం అందించేలా చూడాలని కోరాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement