Sunday, May 19, 2024

Jail Dairy – చంద్ర‌బాబు డే 2…మోర్నింగ్ వాక్… యోగా..

రాజ‌మండ్రి – టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన త్వరగా నిద్రపోయారు. ఈ ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆయన వాకింగ్, యోగా చేశారు. అనంతరం న్యూస్ పేపర్లు చదివారు. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆయన సహాయకుడు ఆయనకు అల్పాహారాన్ని అందించాడు. అనంతరం ఆయన మెడిసిన్స్ వేసుకున్నారు. ఈ రోజు తన కుటుంబసభ్యులతో చంద్రబాబు ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. జైల్లో స్నేహ బ్లాక్ మొత్తాన్ని చంద్రబాబుకు కేటాయించారు. బ్లాక్ లో ఒక పత్రేక గదిని ఆయనకు ఇచ్చారు. చంద్రబాబుకు ఇంటి భోజనాన్ని కోర్టు అనుమతించింది. చంద్రబాబు హౌస్ రిమాండ్ పై ఈ మధ్యాహ్నం తీర్పు వెలువడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement