Tuesday, May 14, 2024

Indrakiladri – అమ్మ‌వారి తెప్పోత్సవ పాసుల జారీలో వివాదం.. పాల‌క‌మండ‌లికి సైతం మొండిచేయి

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో – శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరగనున్న తెప్పోత్సవ పాస్ ల జారీ లో వివాదం తలెత్తింది. కృష్ణా నదిపై నిర్వహించే స్వామివారి తెప్పోత్సవ హంస వాహన సేవలో పాల్గొనే వారిలో వైదిక కమిటీ సభ్యులతో సహా 32 మందికి మాత్రమే పాసులను జారీ చేశారు. హంస వాహనం పైకి వ నేతలు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి సభ్యులు చైర్మన్ కు అనుమతి నిరాకరణ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నదీ విహారాన్ని దూరం నుంచి వీక్షించేందుకుగాను ప్రజాప్రతినిధులకు ఘాట్ పాసులను మాత్రమే దేవాదాయ శాఖ అధికారులు జారీ చేశారు. తనకు పంపించిన ఘాట్ పాసులను తిరిగి మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వెనక్కి పంపించారు.

హంస వాహనంపై అనుమతి లేకపోవడంపై చైర్మన్, సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా నిబంధనల ప్రకారమే పాసులను జారీ చేసినట్లు దేవాదాయశాఖ దేవస్థానం అధికారులు చెబుతున్నారు. ప్రజా ప్రతినిధులు ఇతర ముఖ్య నేతల అధికారుల కోసం బోధిసిరి పర్యాటక బోట్ ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. తమను హంస వాహనంపైకి ఎక్కించాలని ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇతర ముఖ్య ప్రజా ప్రతినిధులు పట్టు పట్టడం ఇప్పుడు వివాదాస్పదమయింది.

హంస వాహనంపై నదీ విహారం చేయనున్న అమ్మవారు స్వామివారు…

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దసరా పర్వదినం సోమవారం సాయంత్రం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి కృష్ణా నదిలో నదీ విహారం చేయనున్నారు. కృష్ణా నదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేసిన అధికారులు కాసేపట్లో కృష్ణ నదిలో హంస వాహనంపై శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులు విహరించనున్నారు. ఇంద్ర కీలాద్రి కొండపై నుండి ఉత్సవ విగ్రహాలు అత్యంత వైభవంగా నిర్వహించే ఊరేగింపుతో శివాలయం మెట్ల మార్గం నుండి దుర్గా ఘాటుకు చేరుకోనున్నాయి. అనంతరం దుర్గా ఘాట్ దగ్గర స్వామివార్లకు ఆలయ అర్చకులు వేద పండితులు వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అనంతరం కృష్ణా నదిలో మూడు సార్లు హంస వాహనంపై స్వామివారి అమ్మవారు విహరించనున్నారు.దుర్గా ఘాట్ లో పాసులు ఉన్న వారికి మాత్రమే పోలీసులు అనుమతించనున్నారు. పున్నమిఘాట్, ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా నదీ విహారాన్ని వీక్షించే విధంగా అధికారులు విస్తృత ఏర్పాటు చేశారు.

- Advertisement -

పూర్ణాహుతితో ముగిసిన శరన్నవరాత్రి వేడుకలు..

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో గడిచిన తొమ్మిది రోజులుగా జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి పూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. అక్టోబర్ 15వ తేదీ నుండి ప్రారంభమైన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో కనకదుర్గమ్మ వారు తొమ్మిది రోజులు పది అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రి కి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో శరన్నవరాత్రి వేడుకలు ముగిసాయి. సాంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్ఛారణల నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు వైదిక కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ ఆలయ ఈవో కెఎస్ రామారావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు తో పాటు పాలక మండల సభ్యులు వైదిక కమిటీ సభ్యులు వేద పండితులు ఆలయ అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement