Thursday, May 2, 2024

Indarkiladri – గాయ‌త్రి దేవిగా భ‌క్తుల‌కు దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో .. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు అమ్మవారి గాయత్రీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 3 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి క్యూ లైన్ ల ద్వారా చేరుకుంటున్నారు.

సకల మంత్రాలకు మూలమైన శక్తిగా,సంధ్యా దేవత, వేదమాతగా కొలవబడే గాయత్రీ దేవిని కొలుచుకునేందుకు రెండు చేతులు కూడా చాలడం లేదు. ముక్తి, విదుమ, హేమలీల ధవళ వర్ణ లతో ప్రకాశిస్తున్న గాయత్రీ దేవి. పంచె ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవి గాయత్రి దేవి. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, సిఖ యందు రుద్రుడు ప్రకాశిస్తుండగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement