Sunday, June 4, 2023

మోడల్‌ స్కూల్స్‌, ఎడ్యుకేషన్‌ సోసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

అమరావతి,ఆంధ్రప్రభ: మోడల్‌ స్కూల్‌,మరియు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ఎడ్యుకేషన్‌ సొసైటీ- ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుండి 62 సంవత్సరముల వరకు పెంచాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోమన్‌రెడ్డి ఆమోదం తెలిపారు త్వరలో జరగబోయే క్యాబినెట్‌ అజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని ముఖ్యమంత్రి విద్యాశాఖ ను ఆదేశించారు మోడల్‌ స్కూల్‌ మరియు ఎడ్యుకేషన్‌ సోసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాల కు పెంచినందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆ సంఘం ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement