Tuesday, April 30, 2024

ATP : ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్

శ్రీ సత్య సాయి బ్యూరో, అక్టోబర్ 30(ప్రభన్యూస్): శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ఎస్పి మాధవరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమం పలువురుని ఆకట్టుకుంది. ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులు వందల సంఖ్యలో తరలివచ్చి పోలీస్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని లెక్కించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తో పాటు పలువురు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ తదితరులు నిత్యం చేసే విధుల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలపాలు, ముఖ్యంగా హింసాత్మక సంఘటనలు, దోపిడీలు, లూటీలు వంటి సంఘటనలు చోటు చేసుకోవడం ద్వారా తలెత్తే సమయంలో పోలీసులుగా తాము ఏ విధమైన చర్యలు తీసుకుంటామనేది పూసకొచ్చినట్లుగా వివరించారు. ప్రధానంగా మొదటి దశ కింద లాఠీ చార్జి చేయడం జరుగుతుంది. పరిస్థితి అదుపులోకి రాకుంటే ముందుగా పొగ బాంబులు విసిరి సంఘ వ్యతిరేక శక్తులను జరుగుతుంది. అప్పటికి పరిస్థితి చేసేదిలేక లబ్బరు బుల్లెట్ వినియోగించి కాల్పులు జరుగుతాం. అయినప్పటికీ సమస్య పరిష్కారం కానప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నిజమైన కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకుంటాము. ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పోలీస్ స్టేషన్ ల పరిధిలో పోలీసుల విధుల గురించి విద్యార్థులకు వివరించడం జరుగుతోంది. బావి భారత పౌరులు ఈ విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుని భవిష్యత్తులో ఏదైనా హింసాత్మక సంఘటనలు, మతపరమైన సంఘటనలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు జరిగినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం తోపాటు విషయాన్ని పోలీసులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఎస్పీ విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పి విష్ణు, హలో డిఎస్పీలు సిఐలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement