Monday, May 6, 2024

ఖాకీ డ్రెస్సుతో అక్ర‌మ‌ వ‌సూళ్లు.. గుంటూరులో న‌కిలీ పోలీసు అరెస్టు

గుంటూరు, వెస్ట్ క్రైమ్, (ప్రభ న్యూస్) : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లాలో న‌కిలీ పోలీసుని అరెస్టు చేశారు. నగరంలోని లాల్ పురం బైపాస్ వద్ద నల్లపాడు పోలీసులు ఈ న‌కిలీని అరెస్టు చేశారు. చుట్టుగుంటలో నివాసముండే డప్పుపాటి సుబ్రహ్మణ్యం చెడు అలవాట్లకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలన్న‌ ఉద్దేశంతో ఏకంగా పోలీసు అవతారం ఎత్తాడు. నగరంలోని శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వాహనాలను ఆపి వారి వద్ద నుండి డబ్బులు అక్రమంగా వసూళ్లు చేస్తున్నాడు సుబ్రహ్మణ్యం. ఈ క్రమంలో నల్లపాడు ఎస్ ఐ కిషోర్ చాకచక్యంగా అత‌డిని అరెస్టు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement