Friday, May 3, 2024

నెల్లూరుకి ఐసీఎంఆర్ బృందం.. ఆయుర్వేద మందుపై అధ్యయనం

కరోనాకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై అనుమానాల నివృత్తి కోసం సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. నెల్లూరుకు ఐసీఎంఆర్ బృందాన్ని పంపాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. కొవిడ్‌పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆనందయ్య ఇస్తోన్న ఆయుర్వేద ఔషధం అధ్యయనం చేయనున్నారు. సాయంత్రానికి ఐసీఎంఆర్ బృందం నెల్లూరు వెళ్లే అవకాశం ఉందని మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు.

కాగా, కృష్ణపట్నం కరోనా మందు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న కరోనా మందు దివ్య ఔషధంలా పనిచేస్తోందని సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరగడంతో కరోనా బాధితులు వేల సంఖ్యలో క్యూ కట్టారు. కోవిడ్ బారినపడి ఆస్పత్రుల్లో లక్షలు ధారపోసినా ప్రయోజనం లేదని.. ఆనందయ్య కరోనా మందు తీసుకున్న గంటలు, రోజుల్లోనే నయమైపోయిందంటూ కొందరు రోగులు చెబుతున్న వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఆనందయ్య మందుకి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement