Wednesday, May 1, 2024

ICDS – షాక్ లో గ‌ర్భిణి – పౌష్టికాహారం ప్యాకెట్ లో పాము కళేబరం

బంగారుపాళ్యం ; అక్టోబర్ 11 ప్రభ న్యూస్ – గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ ద్వారా అందించే పౌష్టికాహారం లో పాము కళేబరం కనిపించింది. తినే ఆహార పాకెట్ లో పాము కళేబరం చూసిన మహిళ షాక్ కు గురై ఆందోళన వ్యక్తం చేశారు. మండలం పరిధిలోని జంబువారిపల్లె పంచాయతీ శాంతినగర్‌ అంగన్ వాడీ కేంద్రంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మానస అనే గర్భిణి అంగన్‌వాడీ కేంద్రంలో ఇచ్చిన ప్యాకెట్ తీసుకుని శ్రీమంతం నిర్వహించుకునేందుకు తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఖర్జూరాల ప్యాకెట్ విప్పి చూడగా అందులో పాము కళేబరం కనిపించింది. ఈ దృశ్యంతో అవాక్కైన మహిళ అంగన్‌వాడీ సూపర్‌వైజర్ రెడ్డి కల్యాణి సాయంతో సీడీపీఓ వాణిశ్రీదేవి కి సమాచారం అందించింది.

ప్యాకెట్లో పాము కళేబరం ఉన్న మాట వాస్తవమేనని సీడీపీఓ అంగీకరించారు. ఈ ఘటన గురించి ఉన్నతాధికారులకు చెప్పామని, మానసకు మరో ప్యాకెట్ ఇవ్వాల్సిందిగా గుత్తేదారును ఆదేశించామని సిడిపిఓ పేర్కొన్నారు. తినే ఆహార ప్యాకెట్ లో జంతు కళేబరాలు ఉండటం గుత్తేదారు నిర్లక్యమని ఐసిడిఎస్ అధికారులు తప్పించు కుంటున్నారని, గర్భిణీలకు అందించే పౌష్ఠికాహారం నిరంతరం తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరును ప్రజలు విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement