Thursday, May 2, 2024

భారీ వ‌ర్షాల‌తో అప్ర‌మ‌త్త‌త‌ .. కమిషనర్ బాలాజీ నాయక్..

శ్రీకాళహస్తి ప్రభ న్యూస్ : రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ బాలాజీ నాయక్ తెలిపారు . 9వ తేదీన అల్పపీడనంగా మారుతుందన్నారు.. దీని ప్రభావంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వారు తెలియజేశార‌ని వెల్ల‌డించారు. పట్టణ ప్రజలు అత్యవసర దృష్ట్యా ఈ క్రింద తెలిపిన ఫోన్ నెంబర్లను సంప్రదించాల‌ని బాలాజీ నాయక్ చెప్పారు.. (9849905866), సానిటరీ ఇన్స్పెక్టర్, ఈ. శ్రీనివాసులు (9000060797) రెవిన్యూ ఇన్స్పెక్టర్ బి.బాల చంద్ర( 9989407474), రెవిన్యూ ఇన్స్పెక్టర్ పి.రవి కాంత్ (9848859456 నెంబర్లను సంప్రదించాలని, పట్టణ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement