Saturday, May 4, 2024

Breaking | తుంగభద్రకు భారీగా వరద.. ఇన్ ఫ్లో 1.14 లక్షల క్యూసెక్కులు

ఎగువ‌న కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో కృష్ణా న‌దికి కూడా వ‌ర‌ద ప్ర‌వాహం పెరిగింది. తుంగభద్ర ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. జలాశయం ఎగువన కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో డ్యామ్‌ వరద నీటితో ఉప్పొంగుతోంది. నాలుగు రోజుల నుంచి తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుంది. నిన్నటి వరకు 20 టీఎంసీలకు మించి నీరు ఉండేది కాదు.

ప్రస్తుతం 50 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నట్లు అధికారులు చెప్పారు. గురువారం ఉదయం తుంగభద్ర ప్రాజెక్టు నీటిమట్టం 1633 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1615.56 అడుగులకు చేరుకుంది. ఇక జలాశయానికి 113981 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ప్రాజెక్టు ద్వారా వివిధ కాలువలకు 107 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement