Thursday, May 2, 2024

ప‌రిష‌త్ వివాదంపై రేపు స్ప‌ష్ట‌త‌..

అమరావతి, రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికల ప్రక్రియలో సస్పెన్స్‌ నెల కొంది.. ఎన్నికలకు తాజా నోటిఫికేషన్‌ జారీ చేయా లని అభ్యర్థిస్తూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు వేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్లపై సెలవు రోజుల్లో సైతం హైకోర్టు విచారణ జరుపుతోంది. ఆదివారం ప్రభు త్వం, ఎన్నికల సంఘం, పిటిషనర్ల తరుపు న్యాయ వాదులు తుది వాదనలు వినిపించారు. గత ఏడాది మార్చి, మే నెలల్లో జారీచేసిన నోటిఫికేషన్‌కు సంబం ధించి తదుపరి చర్యలను నిలిపి వేయాల్సిందిగా బీజేపీ, టీడీపీ వేసిన పిటిషన్లపై విచారణ పూర్తికాగా న్యాయమూర్తి తన నిర్ణయా న్ని ప్రకటించాల్సి ఉంది. కాగా జనసేన పిటిషన్‌లోని అంశా లకు సంబంధిం చిన వివరాల సమర్పణకు గడువు కావాలని ఎన్నికల కమిషన్‌ తరుపు న్యాయవాది కోరటంతో అందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ విచారణ వాయిదా వేసింది. బీజేపీ, టీడీపీ పిటిషన్లపై మంగ ళవారం ఉత్తర్వులు వెలువడ నున్నాయి. జనసేన పిటిషన్‌పై కూడా విచారణ పూర్తి కానుం ది. కాగా ఆదివారం మరోసారి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాదరావు విచారణ కొనసాగించారు.
ప్రశ్నించే అధికారం లేదు: ఎన్నికల సంఘం
ఎన్నికల కమిషన్‌ తరుపు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఏపీ పంచాయతీరాజ్‌ నిబంధన ల్లోని రూల్‌ 7 ప్రకారం పరిస్థితు ల కనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం కమిషన్‌కు ఉందన్నారు. దీనికి లోబడి ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిందని చెప్పారు. గతంలో ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడినుంచి ప్రారంభించా లని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిం దని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని దీన్ని ప్రశ్నిం చేందుకు వీల్లేదన్నా రు. దీనికితోడు గత ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా పెద్దఎత్తున ఏకగ్రీవాలు జరిగి ఫాం-10 కూడా జారీ అయిందని వివరించారు. తాజా నోటిఫికేషన్‌తో ఏకగ్రీవంగా ఎన్నికైన వారు నష్టపోతారన్నా రు. న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవు తాయని స్పష్టం చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్‌ దుర్గా ప్రసాద రావు స్పందిస్తూ ఎన్నికలు వాయిదా వేస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చే నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మందికి ఓటు హక్కు వచ్చిందని తాజా నోటిఫికేషన్‌తో వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉంది కదా అని ప్రశ్నించా రు. ఇలాగైతే ఎన్నికలు ఎప్పటికీ నిర్వహించలేమని న్యాయవాది మోహన్‌రెడ్డి వాదించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని చెప్తూ వారి కోసం ఎన్నికలను నిలిపివేయటం సరికాదన్నారు. తెలుగు దేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై మోహన్‌రెడ్డి వాదిస్తూ ఆయన ఎన్నికల్లో పోటీ చేయటం లేదని, పోటీచేసే వారి తరుపున హౌస్‌మోషన్‌ పిటిషన్‌ ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ఆయన పిటిషన్‌ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కిందకు వస్తుందని దాన్ని ధర్మా సనమే విచారించాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రక్రియలో కోర్టుల జోక్యం తగదని పునరుద్ఘాటించారు.
సుప్రీం ఆదేశాలకు విరుద్ధం: పిటిషనర్లు
వర్ల రామయ్య తరుపున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నియమావళి అనేది చట్టం ద్వారా వచ్చిన మార్గదర్శకం కాదని అది రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారమని అందువల్ల ఎన్నికల కమిషన్‌ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించటానికి వీల్లేదన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు నియమావళిని తిరిగి అమలు చేయాల్సిందే అన్నారు. ఈ వ్యాజ్యం ప్రజల కోసం వేయలేదని, ఓటర్ల నిమిత్తం దాఖలు చేసిన పిటిషన్‌గా భావించాలన్నారు.
బీజేపీ తరుపున సీనియర్‌ న్యాయవాది పి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల కమిషన్‌ విచక్షణాధికారాలను పరిధి దాటి వినియోగించ రాదన్నారు. చట్టం నిర్దేశించిన మేరకే నిర్వహించాలన్నారు. సుప్రీం ఆదేశాలను పరిగణన లోకి తీసుకుని పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు నియవాళిని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
జనసేన తరుపున న్యాయవాది జి వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. ఈనెల 8 నుండి ఎన్నికల నిర్వహణ కు కమిషన్‌ ఈనెల 1వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేసిందని దీన్ని సవాల్‌చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసినట్లు గుర్తుచేశారు. ఎన్నికల ప్రక్రి¸, గుర్తులపై రాజకీయ పార్టీలతో ఈనెల 2వ తేదీన సమావేశం నిర్వహిస్తామని చెప్పిన కమిషన్‌ ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా ఏకపక్షంగా నోటిఫికేషన్‌ జారీ చేసిందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది ఎన్నికల కమిషన్‌ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమన్నారు. ఇదే సమయంలో ఎస్‌ఈసీ న్యాయవాది వివేక్‌ జోక్యం చేసుకుంటూ ఈ వ్యాజ్యానికి సంబంధించి పూర్తి వివరాల సమర్పణకు గడువు కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది.
ఇదే అంశానికి సంబంధించి మంగళవారం మరో వ్యాజ్యం విచారణకు రానుందని ఈ లోగా పూర్తి స్థాయి సమాచారంతో సిద్ధమవుతామని వివేక్‌ కోరారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి టీడీపీ, బీజేపీ వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వుల కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. వీలున్నంత మేరకు మంగళవారం ఉత్తర్వులు వెలు వరిం చేందుకు ప్రయత్నించగలమని మౌఖిక సంకేతాలిచ్చారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఎడతెగని సస్పెన్స్‌ నెలకొంది.
కోవిడ్‌ నేపథ్యంలో త్వరితగతిన
ఎన్నికలు: అడ్వకేట్‌ జనరల్‌
ప్రభుత్వం తరుపున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాం వాదిస్తూ ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిన అవసరం ఉం దన్నారు. ఎన్నికల వల్ల కోవిడ్‌ వ్యాక్సి నేషన్‌కు విఘాతం కలుగుతుందని చెప్పారు.ఎన్నికలను ముగించేసి భారీ స్థాయిలో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వివరించారు. కరోనా రెండోదశ విజృంభణ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికలు పూర్తిచేసి కోవిడ్‌ నియంత్రణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు ఇంకా ఐదారు రోజులు మాత్రమే పడుతుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement