Wednesday, April 14, 2021

రష్మిక బర్త్ డే సందర్భంగా.. ఫస్ట్ లుక్ వచ్చేసింది

టాలీవుడ్‌లో అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చేరిన కథానాయిక రష్మిక. ఈ బ్యూటీ ప్రజెంట్ తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో పాటు శర్వానంద్‌ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో నటిస్తోంది. నేడు రష్మిక పుట్టినరోజు సందర్భంగా.. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా నుంచి రష్మిక మందన్నా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫోటోలో పసుపు రంగు చీరలో పువ్వులను కడుతున్నట్లు ఉన్న లుక్‌లో రష్మిక తన అభిమానుల మనసులను దోచేస్తుంది.

కాగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, చిత్ర లహరి, రెడ్ వంటి సినిమాలను తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News