Thursday, May 2, 2024

జగన్ తో ఎమ్మెల్సీ అభ్యర్థుల భేటి – నామినేషన్ ల దాఖలు

అమరావతి: వైసిపి తరుపున ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేస్తున్న ఆరుగురు అభ్యర్ధులు నేడు తమ నామినేషన్లు దాఖలు చేశారు.. శాసన మండలిలో ఖాళీ స్థానాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆరుగురు అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు.  థరెడ్డి, బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, దువ్వాడ శ్రీనివాస్, సీ.రామచంద్రయ్య, మహమ్మద్‌ ఇక్బాల్, కరీమున్నిసాలు ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి బీ ఫామ్‌లు అందుకున్నారు. అనంతరం అసెంబ్లీలో నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.కాగా,  5 సాధారణ ఖాళీలు, ఒక స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో బడుగు, బలహీన వర్గాలకు వైఎస్సార్‌ సీపీ ప్రాధాన్యం కల్పించింది.  తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో ఆయన కుమారుడు బల్లి కళ్యాణ చక్రవర్తికి ఎస్సీ సామాజిక వర్గం కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అదేరీతిలో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఖాళీ అయిన స్థానంలో ఆయన కుటుంబానికే తిరిగి అవకాశమిచ్చారు. ముందే ఇచ్చిన హామీ మేరకు రామకృష్ణారెడ్డి కుమారుడు చల్లా భగీరథరెడ్డిని సీఎం ఎంపిక చేశారు. మరోవైపు మైనారిటీ వర్గానికి ప్రాధాన్యమిచ్చారు. ఆ వర్గానికి చెందిన కరీమున్నీసా, మహ్మద్‌ ఇక్బాల్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. హిందూపురం సమన్వయకర్త ఇక్బాల్‌ గత ఎన్నికల్లో ఓటమి చెందారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆయనకు రెండోసారి అవకాశం కల్పించారు. శ్రీకాకుళం ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిన దువ్వాడ శ్రీనివాస్‌కు న్యాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. బీసీ కోటా కింద ఆయనను ఖరారు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement