Friday, April 26, 2024

ప్రైవేట్ హాస్ప‌ట‌ల్స్ కొవిడ్ అక్ర‌మాల‌పై కొర‌డా

రాష్ట్ర వ్యాప్తంగా 35 కోవిడ్‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు
9 ఆస్పత్రుల్లో అక్రమాల గుర్తింపు
ఒక్కో ఆస్పత్రిలో ఒక్కోరకమైన అరాచకం
బయటపడ్డ నిలువుదోపిడీ
రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్ల దుర్వినియోగం
భారీగా ఫీజుల వసూళ్లు
కేసులు నవెూదు
యాజమాన్యాల అరెస్ట్‌

అమరావతి, : రాష్ట్రంలో కరోనా విజృం భిస్తోన్న నేపథ్యంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రులు నిర్వహిస్తోన్న కాసుల దందా సామాన్యుడి పాలిట శాపం గా మారింది. ఈ దోపిడీపై అనేక ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమై విజిలెన్స్‌ను రంగంలోకి దిం పింది. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్‌ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లతో పాటు వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగం విస్తృత తనిఖీలు నిర్వహించాయి. కృష్ణా, విశాఖ, గుం టూ రు, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ తనిఖీలు కొనసాగాయి. మొత్తం 35 ఆసుపత్రులలో విజిలెన్స్‌ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. తొమ్మిది ఆసుపత్రులలో అవ కతవకలు జరిగినట్లుగా విజిలెన్స్‌ అధికారులు గుర్తిం చారు. ఈ ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నిర్వహిం చిన దాడుల్లోరెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల దుర్వునియోగం జరిగినట్లుగా ఈ దాడుల్లో వెల్లడైంది. అదే విధంగా విశాఖ, కృష్ణా, చిత్తూరు, ప్రకా శం జిల్లాల్లో కోవిడ్‌ అనుమతులు లేకున్నా కొన్ని ఆసుపత్రులు చికిత్స చేస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం తొమ్మిది ఆసుపత్రులలో ప్రభు త్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు రోగుల బంధువులు విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. వీటిపై ఆరా తీసిన విజిలెన్స్‌ బృందం అధికా ఫీజుల వసూళ్లు చేస్తున్న విష యాన్ని ధృవీకరించింది. ఆస్పత్రుల్లో సరైన రికార్డులు మెయిన్‌టైన్‌ చేయకుండా కేవలం కాగితాల రూపంలో రశీదులు ఇస్తున్నట్లుగా విజిలెన్స్‌ విచారణలో వెల్లడైంది. కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటేశ్వర్‌ నర్సింగ్‌ హోమ్‌కు అనుమతి లేకపోయినా.. కోవిడ్‌ చికి త్సలు నిర్వహిస్తున్నట్లుగా దాడుల్లో వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఇదే సమయంలో విశాఖలోని మూడు ఆస్పత్రులు కూడా కోవిడ్‌ అనుమతులు లేకుండా చికిత్స నిర్వహిస్తు న్నట్లు బయటపడింది. మరోవైపు కడప జిల్లాతో పాటు గుంటూరు జిల్లా నరసారావు పేటలో ప్రైవేట్‌ ఆసుపత్రుల వసూళ్ల దందా బయ టపడింది. కడప జిల్లాలోని రెండు ప్రైవేట్‌ ఆస్పత్రులలో అదనపు ఫీజులు వసూలు చేస్తున్న విషయాన్ని విజిలెన్స్‌ బృందం గుర్తిం చింది. గుంటూరు జిల్లా నరసరావు పేటలో సైతం ఇదే దందా కొన సాగుతున్నట్లుగా గుర్తించి చర్యలకు దిగింది. ఇదే సమయంలో అన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్‌ తనిఖీలను కూడా నిర్వహించారు. ఆక్సిజన్‌ ఎంత మేరకు వినియోగిస్తున్నారన్న విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో విజిలెన్స్‌ అధికారులు విచారించారు. చాలా ఆస్పత్రులలో ఆరోగ్య శ్రీ ద్వారా చికిత్సలు చేయడం లేదన్న విష యాన్ని కూడా విజిలెన్స్‌ గుర్తించింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణను ముమ్మరం చేసిన విజిలెన్స్‌ ప్రైవేట్‌ ఆసుపత్రుల యాజ మాన్యాలు.. ఆరోగ్య శ్రీ క్రింద చికిత్సలు అందించకుండా కేవలం డబ్బుల కోసం బెడ్లు ఖాళీ లేవని చెప్తున్నట్లుగా నిర్థారించారు. అవక తవకలకు పాల్పడిన ఆస్పత్రులన్నింటిపై కేసులు నమోదు చేసిన విజి లెన్స్‌ అధికారులు ఆ యాజమాన్యాలను అరెస్ట్‌ చేశారు. పూర్తి స్థాయి లో నిర్వహించి ఆయా ఆస్పత్రులపై వైద్య ఆరోగ్య శాఖతో పాటు పోలీస్‌ శాఖ చర్యలు తీసుకోనుంది.

అనంత‌పురం ఎస్వీ ఆసుపత్రి ఎండి అరెస్ట్….
అనంతపురం నగరంలో కరోనా పేషెంట్ల నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్న ఎస్వీ ఆసుపత్రి యాజమాన్యం పై పోలీసులు కొరడా ఝళిపించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సత్య యేసు బాబు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఒక్కొక్క రోగి నుంచి 25 వేల రూపాయలు వసూలు చేయడమే కాకుండా , నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందిస్తున్న విషయాన్ని తమ నిఘా బృందం బట్టబయలు చేసిందని తెలిపారు. ఎస్‌ వి ఆసుపత్రి ఎండి రవిబాబు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు- వెల్లడించారు. అతనిపై 18 8, 420, 406, 53 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైద్యం పేరుతో దోపిడి చేసే వారి పట్ల సహించేది లేదని పేర్కొన్నారు.

సంకల్ప సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో త‌నిఖీలు..
కరోనా పాజిటివ్‌ బాధితుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుల మేరకు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ మల్లేశ్వరరెడ్డి నేతృత్వంలో తిరుపతిలోని సం కల్ప సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికా రులు దాడులు చేశారు. ఆరోగ్యశ్రీకి అర్హులైన రోగులు వచ్చిన పుడు వారికి ఈ పథకం వర్తించదని చెప్పి నగదు వసూలు చేసినట్లు తనిఖీల్లో తేటతెల్లమైంది. ప్రభుత్వ అనుమతి కన్నా 27 బెడ్లు ఎక్కువగా వేసి రోగుల నుంచి లక్షలాది రూపా యలు వసూలు చేసినట్లు బట్టబయలైంది. రెమిడిసివర్‌ ఇం జక్షన్‌కు 2,500 రూపాయలకు బదులు 3,490 వసూలు చేస్తున్నట్లు విచారణలొ తేలింది. సిటి స్కానింగ్‌ రూ.2,500 కు గాను 4,500 వసూలు చేయడమేగాక ప్రభుత్వం కొవిడ్‌ చికిత్సకు అనుమతించిన చార్జిల కంటే అధికంగా వసూలు చేస్తున్నారని విచారణలో బయటపడింది. రెమిడి సివర్‌ ఇం జక్షన్‌ 45 సంవత్సరాల కన్నా తక్కువ వయసు వారికి కూడా ఇచ్చినట్లు వెల్లడైంది. రికార్డులు కూడా తారుమారు చేసి న ట్లు అధికారులు ధ్రువీకరించారు. డీఎస్పీ మల్లేశ్వరరెడ్డి సం కల్ప సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ యాజమాన్యంపై క్రిమి నల్‌ కేసులు నమోదు చేయాలని ఈస్ట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement