Sunday, May 5, 2024

చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు

బాపట్ల – రాష్టం లో ప్రజలు,పంచాయతీ,మున్సిపాలిటీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పారని డా.ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.బుధవారం ఆయన నివాసంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహాత్మాగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యంను గ్రామ స్థాయిలో ఏర్పటు చేసి, అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై వైసీపీ ప్రభుత్వాన్నే కోరుకుంటున్నారని తెలిపారు.అయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారని,ప్రజలు ఎవరు కూడా నమ్మవద్దన్నారు.బాపట్ల లో మెడికల కళాశాల నిర్మాణంకు 475 కోట్లు మంజూరు చేశారని,త్వరలో నే పనులు ప్రారంభం అవుతాయన్నారు. నూతనంగా జిల్లాలు ఏర్పటు చేస్తున్న ప్రదేశాలలో రాష్టంలో మొత్తం 16 కళాశాలలు నిర్మిస్తున్నారని,ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన ప్రారంభం చేసిన తరువాత విద్య,వైద్యం,వ్యవసాయం,అనేక సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.13 జిల్లాలలో ఉన్న ప్రతి పార్లమెంట్ ను జిల్లా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని,దీనితో పరిపాలన ప్రజల చెంతకు మరింత ముందుకు వెలుతుందన్నరు. రాష్టంలో మొత్తం 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని,అయితే 26 జిల్లాలు చేస్తున్నారని పేర్కొన్నారు.బాపట్ల నే జిల్లా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన చేస్తున్నారని,అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. ఉప సభాపతి కోన రఘుపతి ఏకగ్రీవలు చేసుకోవడానికి పిలుపునిచ్చారని ప్రతి ఒక్కరు అదే విధంగా ఆలోచన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement