Tuesday, April 30, 2024

నేచర్ ఇండెక్స్ లో ఏపీ ఎస్ఆర్ఎం ప్రతిభ – దేశంలోని ప్రవేటు వర్సిటీల్లో 3వ స్థానం

మంగళగిరి రూరల్, ఫిబ్రవరి 18 ప్రభ న్యూస్. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్స్లో 45వ స్థానం లభించింది. ఇండియాలో పేరున్న పలు విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఎస్ఐటీలు, జాతీయ పరిశోధనా సంస్థల నుంచి ప్రఖ్యాత జర్నల్స్ లో ప్రచురితమైన పరిశోధనా పత్రాలను పరిగణనలోకి తీసుకుని నేచర్ ఇండెక్స్ తాజాగా ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ఓవరాల్గా 45వ ర్యాంకును దక్కించుకున్న ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రయివేటు యూనివర్సిటీల ర్యాంకింగ్స్లో 4.16 వాటాతో 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ రంజిత్ థాపా (ఫిజిక్స్), డాక్టర్ షోజి, డాక్టర్ మహేశ్ రవ్వా (కెమిస్ట్రీ), డాక్టర్ అమిత్ చక్రవర్తి (ఫిజిక్స్), డాక్టర్ పంకజ్ భల్లా (ఫిజిక్స్), డాక్టర్ నిమై మిశ్రా (కెమిస్ట్రీ)లకు చెందిన 11 పరిశోధనా పత్రాలు ప్రపంచ ప్రాముఖ్యత సంతరించుకున్న జర్నల్స్ ప్రచురితం అయ్యాయి. ఈ పరిశోధనా పత్రాలన్నీ లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, కెమికల్, ఎర్త్ సైన్స్లకు సంబంధించినవి. మొత్తం 82 జర్నల్స్న క్రోడీకరించి అందులో విశిష్టమైన పరిశోధనా పత్రాలను ఎంపిక చేశారు.

అమెరికా కేంద్రంగా వివిధ యూనివర్సిటీల పరిశోధనలు ప్రొఫెసర్ల పరిశోధనా పత్రాలు, వాటిలోని సైంటిఫిక్ విలువలను గుర్తించి ఏటా నేచర్ ఇండెక్స్ ర్యాంకులను కేటాయిస్తుంది. పలు దేశాల్లోని వివిధ యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు ఈ ర్యాంకులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి ఇండియాలోని ప్రవేటు వర్సిటీల్లో 3వ స్థానం లభించడం విశేషం. ఇండియాలోని గుర్తింపు కలిగిన పలు యూనివర్సిటీలు, ఐఐటీలకు సైతం లభించని ఉత్తమ ర్యాంక్లు ఏపీ ఎస్ఆర్ఎంకు లభించడం అభినందనీయమని యూనివర్సిటీ ప్రొ- వైస్ ఛాన్సలర్ ఆచార్య డి నారాయణరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పరిశోధనా పత్రాలను పంపిన ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్లకు ఏపీ ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణన్, వైస్ చాన్సలర్ ఆచార్య మనోజకుమార్ అరోరాలు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇది ఏపీ ఎస్ఆర్ఎంకు ద క్కిన అరుదైన గౌరవమని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఏపీ ఎస్ఆర్ఎం వర్సిటీ మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలని ప్రెసిడెంట్ డాక్టర్ సత్యనారాయణన్ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement