Wednesday, May 1, 2024

వైభవంగా మహా శివరాత్రి ఉత్సవాలు..

గుంటూరు కల్చరల్, ఫిబ్రవరి 18(ప్రభన్యూస్) : మహా శివరాత్రి ఉత్సవములు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. స్థానిక మారుతి నగర్ లోని శ్రీ కంచి కామకోటి పీఠం శ్రీ మారుతి దేవాలయం ప్రాంగణము నందు గల శ్రీగంగా గౌరీ సమేత గౌరీ శంకర స్వామికి శనివారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రాతఃకాలంలో 4.00గంటల నుండి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు నిర్వహించారు. అదేవిధంగా శని త్రయోదశి కలిసి రావడం చేత భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని శనీశ్వర స్వామికి కైలా అభిషేకములు నిర్వహించుకున్నారు. అదే విధముగా గౌరీ శంకర స్వామి దర్శనార్థం భక్తులు బారులు తీరారు మహాశివరాత్రి పర్వదిన సంరంభం అత్యంత వైభవంగా కొనసాగింది సాయంత్రం 6.00గంటల నుంచి శ్రీశారదా రామలింగేశ్వర భజన సమాజం వారిచే భక్తి సంకీర్తన కార్యక్రమం జరిగింది తదనంతరం 8.00గంటల నుండి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హరికథా కార్యక్రమం నిర్వహించారు రాత్రి పది గంటల నుండి లింగోద్భవ కాల అభిషేకము మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి లింగోద్భవ కాలమునకు అనంతరం శ్రీగంగా గౌరీ సమేత గౌరీ శంకర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగినది జాగరణ ప్రధానంగా సాగిన ఈ కార్యక్రమములో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఆసాంతం తిలకించి భక్త పురస్సరంగా సాగిన కార్యక్రమానంతరం తీర్థ ప్రసాదములు స్వీకరించారు కార్యక్రమాలను కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement