Thursday, April 18, 2024

నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి…ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి: జూన్ 18 ప్రభ న్యూస్- నగరంలో చేపట్టిన అభివృద్ధి నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ త్వరిత గతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నగరపాలక సంస్థ అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించారు. శనివారం ఎమ్మెల్యే ఆర్కే నగరంలో విస్తృతంగా పర్యటించారు. పాత బస్టాండ్ సెంటర్ ప్రగడ కోటయ్య ప్రాంగణంలో జరుగుతున్న డాక్టర్ వైయస్సార్ చేనేత భవన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. నిర్మాణ పనుల్లో పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాలను పాటించి త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించారు. అనంతరం నగరంలోని జగనన్న కాలనీ (టిట్కో గృహ సముదాయం ) వద్ద సుమారు రూ. ఏడు కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు.

అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం జరుగుతుందని, రానున్న కాలంలో జగనన్న కాలనీలో ప్రజలకు ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఈ సబ్ స్టేషన్ ను నిర్మించడం జరుగుతుందన్నారు. సబ్ స్టేషన్ ను పూర్తి నాణ్యతా ప్రమాణాతో నిర్మించాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే RK విద్యుత్ అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించారు. రానున్న ఏప్రిల్ మొదటి వారానికి సబ్ స్టేషన్ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం నగరంలోని తెనాలి రోడ్డు గుంటూరు ఛానల్ వెంబడి రక్షిత మంచినీటి పథకం వద్ద సుమారు 2.5 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న ఇండోర్ స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణ పనులను, రూ.1.50 కోట్లతో చేపట్టిన స్కేటింగ్ రింకు నిర్మాణ పనులను, శుద్ధి చేయబడిన నీటిని పంపింగ్ చేసే కృష్ణ వాటర్ పంప్ హౌస్ నిర్మాణ పనులను, పంప్ హౌస్ వద్ద సుమారు 50 లక్షల నిధులతో చేపట్టిన సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యేఆర్కే పరిశీలించి నగరపాలక సంస్థ అధికారులకు, కాంట్రాక్టర్ కు పలు సూచనలు చేశారు. అనంతరం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి కుంచనపల్లి బైపాస్ రోడ్డు నుండి రేవేంద్రపాడు వరకు సుమారు రూ. 15 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించి నిర్మాణం పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం సుమారు ఐదు కోట్ల రూపాయల నిధులతో పాత రోడ్డులో ఉన్న 33 కెవి 11 కెవి, ఎల్ టీ విద్యుత్తు లైన్ల షిఫ్టింగ్ పనులను విద్యుత్ కార్మికులు , స్థానిక గ్రామస్తుల చేత కొబ్బరికాయలు కొట్టించి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో పట్టణ పార్టీ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, సంకా బాలాజీ గుప్తా, ఎండీ ఫిరోజ్, ఆకురాతి రాజేష్, బేతపూడి నర్సయ్య, నగరపాలక సంస్థ డీఈ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement