Friday, December 6, 2024

దూళిపాళ్ల న‌రేంద్ర‌కు జ‌గ‌న్ షాక్… సంగం డైరీపై యాజ‌మాన్య హ‌క్కులు రద్దు…

గుంటూరు – సంగం డైరీలో అవ‌క‌వ‌త‌క‌లు జ‌రిగాయంటూ ఆరెస్ట్ అయిన ఆ సంస్థ ఛైర్మ‌న్ దూళ్లిపాళ్ల న‌రేంద్ర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ మ‌రో షాక్ ఇచ్చింది.. ఆ సంస్థ యాజ‌మాన్య హ‌క్కులు ర‌ద్దు చేస్తూ నేడు జివో విడుద‌ల చేసింది.. ఈ సంస్థ ఇక స‌హ‌కార రంగంలో కొన‌సాగేలా ఉత్త‌ర్వుల‌ను జారీ చేసింది.. దీంతో ఆ డైరీ పాల‌నా ప‌గ్గాలు ప్ర‌భుత్వం చేతికి వ‌చ్చాయి.. ఈ సంస్థ కార్య‌క‌లాపాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకు తెనాలి స‌బ్ క‌లెక్ట‌ర్ ను ఇన్ చార్జీగా నియ‌మించింది… కాగా మ‌రోవైపు త‌న‌పై ఎసిబి వేసిన కేసుల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ దూళ్లిపాళ్ల న‌రేంద్ర హైకోర్టులో క్యాష్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.. దీనిపై హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతుండ‌గానే ప్ర‌భుత్వం ఈ సంస్థ‌ను స‌హ‌కారం సంఘంలోకి మారుస్తూ జివో విడుద‌ల చేసింది.. సంస్థ కార్య‌క‌లాపాల‌కు ఎటువంటి ఆటంకాలు క‌లుగ‌కూడ‌ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement