Tuesday, May 7, 2024

విదేశాల్లో గుంటూరు మిర్చి ఘాటు – భారీగా ఎగుమ‌తుల ఆర్డ‌ర్లు..

అమరావతి, : కోవిడ్‌ సంక్షోభంలోనూ మిర్చి ధరల ఘాటు- తగ్గలేదు. విదేశాల్లో గుంటూరు మిర్చికి డిమాండ్‌ పెరగడంతో రైతులు ఆనందంతో ఉన్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించటంతో నాణ్యతలోనూ, దిగుబడిలోనూ మిర్చి పంట ఆశాజనకమైన ఫలితాలని చ్చింది. దీనికి తోడు మార్కెట్‌ కూడా అనుకూలంగా ఉండ టం రైతులకు కలిసొచ్చింది. గత ఏడాది కరోనా సంక్షౌభంలో లాక్‌డౌన్‌ విధించటం..రవాణాపై ఆంక్షలు ఉండటంతో డిమాండ్‌ ఉన్నప్పటికీ దేశీయంగా ఇతర రాష్ట్రాలకూ, విదేశాలకు ఎగుమతి చేయలేకపోయారు. ఇపుడు కోవిడ్‌ మహమ్మారి మళ్ళీ విజృంభిస్తున్నా రవాణా ఆంక్షలు లేకపో వటంతో మార్కెట్‌ లావాదేవీలు జోరుగా కొనసాగుతు న్నాయి. విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు రావ టంతో దిగు బడి ఎంత పెరిగినా ధరలకు ఢోకా లేకుండాపోయింది. దేశీ యంగా వినియోగించే సాధారణ రకం మిర్చి క్వింటా గరిష్ఠ ధర గత ఏడాది కన్నా రూ 1000 నుంచి రూ 3 వేలు పెరిగింది. సాధారణ రకం క్వింటా ధర రూ 11 వేల నుంచి రూ 13 వేలు పలుకుతోంది. హైబ్రిడ్‌ పంట క్వింటా ధర రూ 14 నుంచి రూ 18 వేలుగా ఉంది. మిర్చిలో టాప్‌ గ్రేడ్‌ గా భావించే తేజ, బాడిగ రకాలకు మార్కెట్‌ లో బాగా డిమాండ్‌ ఉంది. ఈ రెండు రకాలు విదేశాలకు బాగా ఎగుమతి అవుతు న్నాయి. వీటి గరిష్ట ధర క్వింటా రూ 18 వేల దాకా ఉంది. తేజ, బాడిగతో పాటు- 4884, సూపర్‌ 10, 334, నంబర్‌ 5, 273, 341 రకాలను కూడా ఈ ఏడాది బాగా పండించారు. దేశీయంగా వీటికి కూడా డిమాండ్‌ పెరగుతూ ఉంది. మిర్చిని దేశీయంగా మధ్యప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, తమిళనాడు, గుజరాత్‌ లకు ఎగుమతి
చేస్తున్నారు.

చైనా నుంచి భారీ ఆర్డర్లు
విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు రావటం ఈ ఏడాది మిర్చికి కలిసొచ్చిందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన ఆర్డర్ల ప్రకారం 1.37 లక్షల టిక్కీలు..అంటే సుమారు 55 లక్షల టన్నుల మిర్చిని విదేశాలకు ఎగుమతి చేయను న్నారు. కొవిడ్‌ ఆంక్షలు లేకపోతే..ఇదే ఒరవడి కొనసాగితే విదేశీ ఎగు మతులు 70 లక్షల టన్నులకు చేరుకోవచ్చని అంచనా. మిర్చి ఆర్డర్డు ఎక్కువగా చైనా నుంచి వస్తున్నాయి. చైనాతో పాటు- శ్రీలంక, బంగ్లా దేశ్‌, మలేషియా, సింగపూర్‌, ఆస్ట్రేల్రియా, కెనడా, దక్షిణాఫ్రికా, మెక్సికో, ధాయిలాండ్‌, వియత్నాం, చిలీ దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. 2019-20లో రూ 6,221 కోట్ల విలువైన మిర్చిని విదే శాలకు పంపించగా ఈ ఏడాది ఎగుమతుల విలువ రూ 10 వేల కోట్లు- దాటవచ్చని అంచనా. ఇప్పటివరకు ఉన్న ఆర్డర్లు ప్రకారం రూ 8300 కోట్లు- విలువైన మిర్చిని విదేశాలకు పంపించటం ఖాయమైంది. ఈ ఏడాది వ్యవసాయశాఖ అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 3.87 లక్షల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. సాగు విస్తీర్ణంలో గుంటూరు జిల్లాదే అగ్రభాగం. జిల్లాలో 1.92 లక్షల ఎకరాల్లో మిర్చిని సాగు చేశారు. గుంటూరుతో పాటు- పొరుగునే ఉన్న ప్రకాశం లోనూ మిర్చి బాగా పండింది. కృష్ణా జిల్లాలో అక్కడక్కడా మిర్చిని పండించగా కర్నూలు, అనంతపురం, వైఎస్సార్‌ కడప జిల్లాలోనూ మిర్చిని సాగు చేశారు. ఆసియాలోనే అతి పెద్దదిగా ప్రశస్తి చెందిన గుంటూరులోని మిర్చి యార్డు పంట క్రయ విక్రయాలకు వేదికగా ఉంది. ఏపీతో పాటు- తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్ర నుంచి కూడా ఇక్కడికి మిర్చి వస్తుంది. ట్రేడర్లు ఎక్కువగా గుంటూరు నుంచే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement