Tuesday, April 30, 2024

Breaking: 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేసిన ఏపీ హైకోర్టు

2018 గ్రూప్‌-1పై ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గతంలో జరిగిన మెయిన్స్‌ పరీక్షను రద్దు చేసింది. పరీక్షను మరోసారి నిర్వహించాలని ఆదేశించింది. మెయిన్స్‌ జవాబు పత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది.

2018లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్‌ వాల్యుయేషన్‌పై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరీక్షను తిరిగి 6 నెలల్లో నిర్వహించాలని ఏపీ హైకోర్టు చెప్పింది. జులై 22, 2022లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను ప్రకటించింది. అయితే ఆ తర్వాత డిజిటల్‌ వాల్యుయేషన్‌పై ఏపీ హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌ వేశారు. దీంతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను నిలిపివేశారు. జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనానికి తిరిగి రావాలని ఏపీపీఎస్సీని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ పరీక్షను రద్దు చేసిన ఏపీ హైకోర్టు మరో 6 నెలల్లో ఎగ్జామ్‌ పెట్టాలని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement