Monday, May 6, 2024

ఆన్‌లైన్‌ విక్రయాల దిశగా ప్ర‌భుత్వం అడుగులు.. త్వరలో అందుబాటులోకి వెబ్‌సైట్

రైలు ప్రయాణీకులు రిజర్వేషన్‌ టిక్కెట్లను రైల్వే ఆన్‌లైన్‌ వేదిక ఐఆర్‌సీటీసీలో బుక్‌ చేసుకునే తరహాలో ఇకముందు రాష్ట్రంలో సినిమా టిక్కెట్లు కూడ విక్రయించనున్నారు. అందుకోసం సామాజిక మాధ్యమంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. ఈ ఆన్‌లైన్‌ వేదిక అతిత్వరలో అందుబాటులోకి రానున్నది. సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించే బాధ్యతను రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఏపీ ఫిలిమ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌)కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సినిమా టిక్కెట్ల ధరలపై వివాదం సద్దుమణగక పోయినప్పటితీ ప్రభుత్వంద్వారానే టిక్కెట్ల విక్రయాలు జరిగేలా ప్రభుత్వం ముందుకు వెలుతోంది. ఈ మేరకు జీవో నెంబర్‌ 142ను జారీ చేసింది. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఈ ఉత్తర్వులు ఇచ్చారు.ఇకపై ప్రైవేటు ప్లాట్‌ఫామ్‌లపై టికెట్‌ బుక్‌ చేసుకునే అవకాశం, థియేటర్లలో టికెట్‌ కొనుక్కునే సదుపాయం ఉండదని అధికార వర్గాల సమాచారం.

సినిమా టిక్కెట్‌ ధరల నిర్ణయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే. టిక్కెట్‌ రేట్లను తగ్గించాలంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35ను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు కేవలం పిటిషన్‌ దాఖలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తాయి తప్ప మిగిలిన అన్ని థియేటర్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకే టిక్కెట్లు అమ్మాలని రాష్ట్ర హోంశాఖ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా జీవో నెం.142ను తీసుకురావటం విశేషం. ప్రభుత్వమే ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టిక్కెట్ల అమ్మకాలపై పలువురు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ.. తదనంతర పరిణామాల నేపధ్యంలో మెజారిటీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ప్రభుత్వం పలు మార్లు సమావేశమై ఆన్‌లైన్‌ టిక్కెట్‌ వ్యవస్థపై చర్చలు జరిపింది.

రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని ఆయా వర్గాలతో సమా వేశమై ఆన్‌లైన్‌ వ్యవస్థ వలన ఉండే ప్రయో జనాలను వివరించి ఒప్పించారు. వీరితో నిర్వహిం చిన చర్చల నేపధ్యంలో ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలు తమకు సమ్మత మేనని పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల శాసనసభలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరిస్తూ బిల్లును ఆమోదించారు. చట్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలోనేటిక్కెట్ల విక్రయాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపొందిస్తోంది. వెబ్‌ సైట్‌ రూపకల్పన కొలిక్కి వస్తున్న తరుణంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement